నీతి నిజాయితీపై పవన్ ట్వీట్

జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి ట్విటర్ వేదికగా తన భావాలను పంచుకున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ట్విటర్ లో క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన పవన్.. సర్వమానవాళికి ప్రేమను పంచినప్పుడే శాంతి, ఆనందం ఉంటుందని క్రీస్తు బోధనలను గుర్తు చేశారు.

ఈ క్రిస్మస్‌ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.


నీతి, నిజాయతీ లేని వ్యక్తులు ఎంత సాధించినా అది నిష్ఫలమే అవుతుందని సూచించారు.

అన్నట్టు గతంలో పవన్ కల్యాణ్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జీసెస్ మీద ఒక సినిమాను కూడా ప్లాన్ చేశారు.

కానీ, అదెందుకో కార్యరూపం దాల్చలేదు.