ప్రజల కష్టాలకి సంఘీభావం తెలపటానికి కేంద్రంలోని ఎంపి లందరూ క్యూలో నిలబడితే బాగుంటుందని చెప్పారు.

ప్రజలకు సంఘీభావం తెలపటానికి ఎంపిలందరూ బ్యాంకుల వద్ద, ఏటిఎంల వద్ద క్యూలైన్లో నిలబడాలని సినీనటుడు, జనసేనాధీసుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. డబ్బుల కోసం ప్రజల ఇబ్బందులపై పవన్ తన ట్వట్టర్ ద్వారా ఎంపిలను కోరారు. ప్రజల కష్టాలకి సంఘీభావం తెలపటానికి కేంద్రంలోని ఎంపి లందరూ క్యూలో నిలబడితే బాగుంటుందని చెప్పారు.

అదేవిధంగా ఏపి, తెలంగాణాలోని భాజపా పార్లమెంట్ సభ్యులు కూడా ఏటిఎంల దగ్గర, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలబడితే తమ వంతుగా ప్రజలకు మద్దతు పలికినట్లుంటుందని కూడా అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రజలకు ధైర్యం వస్తుందని కూడా పవన్ చెప్పటం గమనార్హం. ఇటీవలే పవన్ డబ్బుల కోసం ఓ బ్యాంకుకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.