Asianet News TeluguAsianet News Telugu

రెండు రోజుల్లో నంద్యాల మీద పవన్ నిర్ణయం

నంద్యాల ఉప ఎన్నికలలో జనసేన ఎటువైపో రెండు మూడు రోజులలో పవన్ కల్యాణ్ ప్రకటించబోతున్నాడు. ఆయన పాదయాత్ర కూడా చేయాలనుకుంటున్నాడు. అయితే, పాదయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందని భయపడుతున్నాడు.,

pawan to take a decision on nandyal byelection in couple of days

ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఆసక్తికరమయిన విషయాలు.

 

1

నంద్యాల ఉప ఎన్నికల మీద తన వైఖరి జనసేన వైఖరి రెండురోజులో ప్రకటిస్తానని జనసేన అధినేత పవన్ చెప్పారు. నంద్యాల ఎన్నికల మీద ఆయన స్పందించడం ఇదేప్రథమం.  ప్రత్యేక పరిస్థితుల్లో నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్నదని అంటూ  ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే దానిపై మరో రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని చెప్పారు.

2

గరగపర్రు దళితుల సాంఘిక బహిష్కరణ విషయం – ఈ  ఘటన చాలా  సున్నితమైన అంశం. నేను వెళితే  ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే గరగపర్రు వెళ్లలేదు,  గ్రామ స్థాయిలో పరిష్కారం కాకపోవడం వల్ల గరగపర్రు సమస్య జఠిలమై కూచుంది.  నేను అక్కడకి వస్తే నాతోపాటు కార్యకర్తలు వస్తారు. వారితో సంఘ విద్రోహశక్తులు కలుస్తాయి. అందుకే గరగపర్రు వెళ్లాలనుకోలేదు.

3

దేశం  దశా దిశ నిర్దేశించాల్సిన  పెద్దలే గాంధీజీని తెలివైన వైశ్యుడని అంటున్నారు.  ఇది  సరికాదు. (ఈ వ్యాఖ్య  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద ఎక్కుపెట్టింది).  ఇలాంటి ధోరని అంత పెద్ద మనుషులకే  ఉన్నప్పుడు, గ్రామాల్లో ప్రజలకు ఎందుకు ఉండదు?  

4

2019 ఎన్నికల్లో జనసేనకు రెండు శాతం మించి ఓట్లు రావన్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యల మీద స్పందన : ‘‘ఎవరి బలం ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరి తోడ్పాటుతోనో ప్రభుత్వాలు వస్తాయని అనుకోను. ఏపీలో ఏ పార్టీ బలం ఆ పార్టీకి ఉంది. నా ప్రభావం 2 శాతమైనా ఉందని చెప్పినందుకు సంతోషం’’

5

కాపు రిజ‌ర్వేష‌న్ల‌ మీద... 
నాకు కుల మతాలతో , ప్రాంతాలతో పనిలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చాను గనక ఇలాంటి సమస్యలపైనా మాట్లాడాల్సి వస్తోంది. సున్నితమయిన  కాపు రిజర్వేషన్ల అంశం కొన్ని దశాబ్దాలుగా పెండింగులో ఉంది.  రిజర్వేషన్లు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి?  ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయాలు నడపరాదు. కష్టనష్టాలు, లోటుపాట్లు ఏవైనా ఉంటే కమిషన్‌కు చెప్పాలి. శాంతియుతంగా పాదయాత్రలు చేసేందుకు ముందు కొస్తే ఎవరికీ భయంలేదు. గతంలో తుని లో హింస చెల‌రేగ‌డం వ‌ల్లే ప్ర‌స్తుతం పాద‌యాత్ర‌ల‌కు అనుమ‌తి నీయడేం లేదని భావిస్తున్నా.

6

పాదయాత్రకు రెడీ
నేను కూడా పాదయాత్ర చేస్తాను. 2014 నుంచే ఆలోచన ఉంది. పాదయాత్ర చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో బేరీజు వేస్తున్నా.  నన్ను అభిమానించే వారు సహకరిస్తేనే పాదయాత్ర చేస్తాను. నన్నుముందుకు  కదలనివ్వరేమోననే భయం ఉంది. మిగతా వాళ్ల పాదయాత్రకు నా పాదయాత్రకు తేడా ఉంటుంది. పాదయాత్ర వల్ల శాంతిభద్రతలు సమస్య వస్తుందని భయపడుతున్నా

Follow Us:
Download App:
  • android
  • ios