నిన్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉద్ధానం మీద జరిగిన సుహృద్భావ సమావేశం తర్వాత పవన్ నంద్యాల స్టాండ్ ఎలా ఉంటుందో ఉత్కంఠ అవసరం లేదు.

నంద్యాల ఉప ఎన్నిక మీద పవన్ కల్యాణ్ వైఖరి ఎలా ఉంటుంది? రెండు రోజులలో ఆయన నంద్యాలలో ఎవరికి మద్దతివ్వాలనే విషయం మీద ఒక ప్రకటన చేస్తానన్నారు. ఈ ప్రకటన ఎలా ఉంటుందనే ఉత్కంఠ సహజం.

అయితే, నిన్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఉద్ధానం మీద జరిగిన సుహృద్భావ సమావేశం తర్వాత పవన్ నంద్యాల స్టాండ్ ఎలా ఉంటుందో ఉత్కంఠ అవసరం లేదు.

ఆయన చాలా తెలివిగా తనేం చేయబోతున్నాడో సంకేతాలు పంపారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో లేరు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా తయారవాలనుకోలేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించడం ఏ మాత్రం ఆయనకు ఇష్టం లేదు. అంతేకాదు, ముద్రగడ పద్మనాభానికి అనుమతినీయకపోవడంలో కూడా ఆయన లా అండ్ అర్డర్ ఔచిత్యం చూశారు. గరగ పర్ర బాధితులను పరామర్శించడానికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇదీ ధోరణి. ఆయన చంద్రబాబును నొప్పించదలుచుకోలేదని చెప్పకచెప్పారు. ఈ సంకేతాల ప్రకారం ఆయన తెలుగుదేశం పార్టీతో కలసి నడవాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపాలి. మద్దతు తెలిపి, జనసైనికులను పంపి హంగామా సృష్టించాలి. అయితే, ఇది చాలా ప్రమాదకరమయిన నిర్ణయమవుతుంది. ఎందుకంటే, నంద్యాల అనేది ఒక ఉప ఎన్నిక మాత్రమే. ఈ ఉప ఎన్నికలో తాను మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, పరువు పోతుంది. పవన్ కల్యాణ్ ఇంతేనా అనుకుంటారు. ఈ మాత్రం దానికి రెండేళ్లుగా అంత బిల్డప్ ఇచ్చిన, రిక్రూట్ మెంట్ జరిపి యంత్రాంగం ఏర్పాటుచేసుకున్నాక మొదటి ఎన్నికలోనే పరాభవం ఎదురయితే, 2019లో ఎలా ఉంటుందో వూహించగలరు. అందువల్ల పబ్లిక్ గా రంగంలోకి దిగి పవన్ తెలుగుదేశం పార్టికి మద్దతిచ్చే అవకాశంతక్కువ . ఎదయినా జరిగితే లోపాయకారిరాగా మద్దతీయాల్సిందే.

 లేదా మరొక అవకాశం ఉంది. పరాజయ పరాభవం నుంచి తప్పుకోవాలంటే మరొక మార్గం ఉంది. సురక్షితమయిన మార్గం కూడా. ‘నంద్యాల ఎన్నికలు చాలా చిన్న విషయం. ప్రస్తుతానికి జనసేన పార్టీ నిర్మాణం మీద దృష్టిపెట్టింది. 2019లో ఒకే సారి జనసేన తలపడుతుంది. విజ్ఞులయిన వారిని నంద్యాల ప్రజలు ఎన్నుకోవాలి’ అని ఒక విజ్ఞప్తి ట్వటర్లో పడేసి, నంద్యాల ఎన్నికల్లో పాల్గొనకుండా తప్పించుకోవచ్చు.

పవన్ రెండో మార్గం ఎన్నుకునే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది.