Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణా ఊసెత్తని పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ తెలంగాణ  ప్రజల గురించి మాట్లాడటం లేదు? ‘జనసేన’ ఆంధ్ర పార్టీయేనా? తెలంగాణాలో ఏలు పెడితే  కవిత, కెటిఆర్, టిఆర్ ఎస్ వాళ్లు కుడతారని భయమా?

pawan strategy to 2019

కొన్ని విషయాలను స్పష్టం చేసినా, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ స్ఫష్టం  చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అంత పెద్ద అమరావతి రాజధాని వేస్టటని చంద్రబాబు  మీద తన ధోరణి చెప్పాడు. ఇపుడు బిజెపి ‘దేశభక్తి’ డొల్ల అనేశాడు.  ఈ లెక్కన అయన యాంటి ఇంకంబెన్సీ తనకు అంటకుండా కాపాడుకున్నట్లే లేక్క. అయితే, రాజకీయాలు ఇంకా అసంపూర్తిగా నే ఉన్నాయి.  ఆయన సగం తెలుగువాళ్ల గురించే మాట్లాడుతున్నాడు. మరొక సగం మర్చిపోయాడు. ఆ సగమే తెలంగాణా!

 

తెలుగువాడైనా ఆయన వ్యూహం తెలంగాణా కు  విస్తరించే అవకాశం కనిపించడం లేదు. ఆయన  ఆంధ్రోడిగా నే ఉండాలనుకుంటున్నట్టుంది. తెలంగాణాలో జనసేన నిర్మాణం గురించి గాని, తెలంగాణాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి  ఆయన మాట్లాడటం లేదు. ఎందుకు?

 

తెలంగాణలో కూడా ఉండేది తెలుగు వాళ్లే కదా. వాళ్లూ పవన్ సినిమాలు చూస్తున్నారు కదా.  ’ మీరు సినిమాలు బాగా చూస్తే నాకు డబ్బులొస్తాయి. పార్టీ నడిపేందుకు వీలవుతుంది,’ అని ఆ మధ్య అన్నారు. అంటే, తెలంగాణా ప్రేక్షకులు అందించే డబ్బులతో ఆంధ్ర పాలిటిక్స్ నడుపుతారా?

 

లేక, తెలంగాణా అంటే భయపడుతున్నారా?  తెలంగాణా మన రాష్ట్రం కాదు, వాళ్ల సంగతి మనకెందుకు అనుకుంటున్నారా? లేక తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీస్తే కవిత , కెటిఆర్, తెలంగాణ యాక్టివిస్టలు  మీద పడి రక్కేస్తారని భయమా?

 

 ఆంధ్రలో నివసించేందుకు అక్కడ హైదరాబాద్ లాంటి రాజధాని లేదు.ఓట్ల అడ్రసు ఏలూరు అయినా, పర్మనెంటు  అడ్రసుకు హూదరాబాదే హాయి  అని అనుకుంటున్నారా. అందువల్ల తెలంగాణ పుట్టలో చేయిపెడితే,  వెచ్చటి ఆశ్రయం కరువతుందని బెదురా?

 

వీటికి సమాధానాలు చెప్పాలి. ఎందుకంటే, తెలంగాణా ప్రభత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు  చేస్తూ ఉందని, ఆ రాష్ట్రం విద్యను ప్రయివేటు పరం చేస్తూ ఉందని, రైతుల ఆత్మ హత్యలు కొనసాగుతున్నాయని, రైతుల భూములను  ప్రభుత్వం లాక్కుంటూ ఉందని  చెబుతూ ప్రొఫెసర్ కొదండ్ రామ్ వాంటి వారు ఉద్యమాలుచేస్తున్నారు. మూడుకోట్ల తెలంగాణా ప్రజల గురించి ఇంతవరకు మాట్లాడక పోవడం పిరికితనమే అవుతుంది.

 

మరొక విషయం.  రాజకీయాలలో  ఒంటరిపోరు తీసుకుంటారా లేక తన లాంటి వాళ్లతో కలుస్తారా?

 

బహుముఖ పోటీ ఉన్నపుడు తను కూడా  ఒంటరి పోరే అంటే లాభం చేకూరేది తెలుగుదేశం పార్టీకి, బిజెపికే. వాళ్లే పవన్ కల్యాణ్ ని ఎన్నికల్లో నిలబెట్టారని అపవాదుకూడా వస్తుంది. చిరంజీవి ‘ ప్రజారాజ్యం’ పార్టీ పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సహాయం చేసేందుకే ననే విమర్శ ఉంది.

 

పవన్ బిజెపిని విమర్శించేది, తెలుగుదేశం ను వ్యతిరేకించేది వాళ్ల  ప్రతిపక్షం ఓట్లు చీల్చేందుకే నని అంతా అంటారు. తన దారెటో చెప్పాలి. దీనికి  ఇంకా సమయం ఉందనుకున్నా

 వివరణ ఇవ్వాల్సిన బాధ్యత  ఉంటుంది.

 

 

 

 

 

 

సీరియల్  ట్వీట్ లలో భాగంగా శనివారం నాడు బిజెపి దేశభక్తి డెఫినిషన్ నుజ్జు నుజ్జు చేశారు.  ఒకపార్టీ కళ్లద్దాలనుంచి కనిపించేది దేశభక్తి  కానేకాదుపొమ్మన్నారు.

 

ఇలా ఇంత ఘాటుగా బిజెపి తరహా దేశభక్తిని  ఈ మధ్య కాలంలో మెయిన్ స్ట్రీమ్ రాజకీయనాయకులెవరూ మోదీ నాయకత్వంలోని బిజెపిని ఇలా తోసిపుచ్చలేదు. బిజెపితో ఎపుడు ఏమి అవసరమొస్తుందోనని నీళ్లునమలడం కాంగ్రెసేతర పార్టీలన్నింటిలో కనిపిస్తుంది. ఇలాంటపుడు పవన్ శనివారం ప్రయోగించిన ట్వీట్ చాలా బలమయిందనే చెప్పాలి.

 

'కులం, మతం, జాతి, ప్రాంతం, వర్గం, భాషాతీతంగా ఒక వ్యక్తిగానీ, రాజకీయ పార్టీగానీ వ్యవహరించినపుడే  నిజమైన దేశభక్తి కనిపిస్తుంది,’ అని  అని పవన్ అన్నారు.

 ఇవిగో పవన్  శనివారం ట్వీట్లు :


'ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అభిప్రాయంతోగానీ, విధానంతోగానీ విభేదిస్తే.. వారిని దేశద్రోహులుగా ముద్ర వేయకూడదు. ఇకవేళ వారు తమ ప్రత్యర్థుల గురించి తీవ్ర అభిప్రాయాలు వెల్లడించినా.. వారి గొంతును నులిమివేయకుండా మొదట వారు చెప్పేది వినాలి. ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా హడావిడిగా చర్యలు తీసుకుంటే జేఎన్‌యూ విద్యార్థులపై 'దేశద్రోహం' కేసు మాదిరిగానే ఎదురుదెబ్బ తగిలే అవకాశముంటుంది. జేఎన్‌యూ విద్యార్థుల కేసులో చివరకు వారి వీడియో కావాలని మార్చినట్టు తేలింది' అని అన్నారు.  

 

‘నిజమయిన దేశభక్తి మానవీయ విలువలను పుడుతుంది.  అది అన్ని కోణాలను స్పృశిస్తుంది.’

 

‘ ప్రజాస్వామిక వ్యవస్థలో పాలక పార్టీని విబేధించడాన్కి దేశవ్యతిరేక ముద్ర వేయడానికి వీల్లేదు. ఒక వేళ అలాంటి తీవ్రమయిన పోకడ పోవాలనుకున్నా అవతలి వాళ్లు చెప్పేదాని, వాళ్ల గొంతునొక్కకుండా వినాలి, తర్వాత చర్యలు తీసుకోవాలి. తొందర పడి ఏదయిన చర్యతీసుకుంటే అది జెఎన్ టియు (ఇది జెఎన్ యు అని వఉండాలి తప్పయిందని పవన్ తర్వాత క్షమాపణలు చెప్పారు) విద్యార్థుల దేశ ద్రోహ కేసులా గ బెడిసి కొడుతుంది. ఈకేసులో ఏమయింది, చూపించినవన్నీ బోగస్ టేపులేనని బయటపడింది.’

 

'కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ ఆస్వాదించాల్సిన సాయంకాలాన్ని 'దేశభక్తి' ని నిరుపించేకునే పరీక్షకు వేదికగా మార్చకూడదు.‘

 

‘రాజకీయ పార్టీలు తమ సభల్లో మొదట జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించవు? దేశంలోని ఉన్నత కార్యాలయాల్లో ఎందుకు ఆలపించడం లేదు? చట్టాలను అమలుచేయాలని ప్రబోధించే వారు మొదట తాము మార్గదర్శకంగా ఉండి ఇతరులు అనుసరించేలా చేయవచ్చు కదా.’

 

'ఇవన్నీ చూస్తుంటే, “నిజాయితీపరులకు చట్టాలను ఉచ్చుగా మార్చి, మోసగాళ్ల మజా చేస్తున్నారా వాటిని బొనంజా చేస్తున్నారా”  అన్న అమెరికా ఆర్థికవేత్త థామస్‌ సోవెల్‌ వ్యాఖ్య గుర్తొస్తున్నది.

 

 

ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తానని ఆయన ట్వీట్‌ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios