ప్రాంతీయ పార్టీల అధినేతల హోదాలో, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో వారిద్దరూ హామీలిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా పూర్తిగా వారిదే.

రుణమాఫీ విషయమై జనసేన అధ్యక్షుడ పవన్ కల్యాణ్ ముందు ప్రశ్నించాల్సింది ఇద్దరు చంద్రులనే. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో రైతు రుణాలను మాఫీ చేస్తానని హామీలిచ్చింది చంద్రబాబునాయడు, కె. చంద్రశేఖర్ రావులే. ఆనాడు వారిచ్చిన హామీలను ఎవరిని అడిగి ఇచ్చారు? వారేమీ భారతీయ జనతా పార్టీ నేతలు కాదుకదా? ప్రాంతీయ పార్టీల అధినేతల హోదాలో, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో వారిద్దరూ హామీలిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా పూర్తిగా వారిదే. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హామీని అమలు చేయలేక ఇరుక్కున్నారు అది వేరే సంగతి.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రుణమాఫీకి కేంద్రం సహకరించాలని పవన్ కోరటంలో తప్పేమీలేదు. కానీ అంతుకుముందు పవన్ చేయాల్సిన పని ఒకటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు సక్రమంగా అమలు చేయటం లేదని పవన్ చంద్రబాబునాయుడు, కెసిఆర్ లను నిలదీయాలి. యూపిలో రుణమాఫీని కేంద్రం భరిస్తుందంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేసిన ప్రకటనను పవన్ తప్పపట్టారు.

యుపిలో రుణమాఫీకి హామీ ఇచ్చింది భాజపా. అధికారంలోకి వచ్చింది కమలం పార్టీనే. కేంద్రంలో ఉన్నది కూడా భాజపానే. కాబట్టి ఆ హామీని నెరవేర్చే బాధ్యతను కేంద్రం నెత్తికెత్తుకున్నది. రుణమాఫీ ఒక్క యుపికే పరిమితం చేయకుండా అన్నీ రాష్ట్రాలకూ వర్తింపచేస్తే సంతోషమే. కానీ దాని ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని పవన్ అనటంలో అర్ధం లేదు.