పవన్ కు అమిత్ షా పెట్టిన బేరం ఏమిటో తెలుసా?

భారతీయ జనతా పార్టీని పవన్ కల్యాణ్ బాగానే అంటుకున్నారు. కేంద్రంలో ఎన్డీయే రూపంలో ఉన్న బిజెపి దక్షిన భారతదేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. వివక్ష అన్నారు. ఉత్తరాది పెత్తనం అన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా చాలా ట్వీట్స్ చేశారు. నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని అందరికంటే ఎక్కుగా  విమర్శించారు. 

2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మోదీ పక్కన నిలబడి బిజెపికి ప్రచారం చేశారు. బిజెపి-టిడిపి కాంబినేషన్ గెలిపించిన క్రెడిట్ కొట్టేశారు. అలాంటి వపన్ బిజెపి వ్యతిరేకి ఎలా అయారు. చాలా కాలంగా దీనికి క్లూ దొరక లేదు. ఈ రోజు పవన్ కల్యాణ్ ఒంగోలులో వెళ్లడించారు.

ఆయన మాటల్లో నే విందాం.

‘‘ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశాను. ఇక భవిష్యత్తు జాతీయ పార్టీలదే. , కాబట్టి జనసేనను బీజేపీలో విలీనం చేసేసేయ్ అన్నారు. నేను ఆశ్చర్య పోయాను. ఆయన ప్రతిపాదనని  సున్నితంగా తిరస్కరించాను.  ఆయనకు తగిన రీతిలో సమాధానం ఇచ్చాను.  జాతీయ పార్టీలే సక్రమంగా పని చేస్తే అసలు ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఏర్పాటు అవుతాయి అని  ప్రశ్నించాను.’ అన్నారు. ఇది తెలుగు వారి పార్టీ,  జాతీయ భావాలున్న పార్టీ అని చెప్పాను. ఆహ్వానించినందుకు ధాంక్స్ చెప్పి, పార్టీ మూసేసే పనిచేయనని చెప్పానని పవన్ వివరించారు. ఇదిగో వీడియో....

 

‘నన్ను నమ్ముకొని మీరు అపుడు ఓటేశారు. మీ ఆశలను నేను వమ్ము చేయను,’ అని పవన్ భరోసా ఇచ్చారు.

‘‘బీజేపీ కూడా ఒకప్పుడు సింగిల్ డిజిట్ తోనే పార్లమెంటులోకి ప్రవేశించింది.  రాజకీయ ప్రస్థానం ఆరంభించింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.నాకు రాజకీయాల వల్ల పిడికెడు ఉపయోగం కూడా లేదు. ఓడిపోతానేమో కానీ.. దెబ్బకొట్టే వెళ్తాను,’ అని  హెచ్చరించారు.

 ప్రభుత్వాలైనా, ప్రతిపక్షాలైనా.. బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే.. ప్రజా ఉద్యమాలు వస్తాయని అన్నారు.శనివారం నాడు ఒంగోలు, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఇక్కడ ప్రత్యేక హోదా ప్రతిన చేయించారు. ‘ప్రత్యేక హోదా కోసం పోరాటానికి నేను సిద్ధం, మీరు సిద్ధంగా ఉన్నారా..? అని అభిమానుల్ని, రాష్ట్ర, ప్రభుత్వాన్ని,  ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.

 ‘ప్రభుత్వాలకు బాధ్యత ఉండాలి, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాట గెల్చిన ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. అందరం కోరుకుని పోరాడితేనే ప్రత్యేక హోదా వస్తుంది,’ అని అన్నారు.

 

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆధార్ కావాలని అడుగుతావుంది.  మనం ఇవ్వకపోతే ఏమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి... ఇదిఒంగోలు సందేశం.