పవన్ జనసేన రిక్రూట్ మెంట్ మొదలు. మొదట అనంతపురం నుంచి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 4 దాకా...

పవన్ కల్యాణ్ సైన్యంలో చేరేందుకు ప్రకటన విడుదల చేశారు.అయితే ప్రస్తుతానికి రిక్రూట్ మెంట్ అనంతపురంజిల్లాకే పరిమితం చేశారు. మిగతా జిల్లాలకు కూడా త్వరలో భారీ ప్రకటన విడుదలవుతుందట.

సమగ్ర రాష్ట్ర స్థాయి అవగాహన ఉన్నవారిని వ్యాఖ్యాతలుగా,రచనా రంగంలో నైపుణ్యం వున్నవారిని కంటెంట్ రైటర్స్ గా, అంటే విశ్లేషణ పరిజ్జానం ఉన్న వారిని విశ్లేషకులుగా జనసేన సైన్యంలోకి తీసుకుంటారు.

దరఖాస్తు చేసిన వారు జనసేన బృందంతో ఎక్కడ కలవాలో వివిధమాధ్యమాలు, ఫేస్ బుక్ పేజీల ద్వారా తెలియచేస్తారు. ఆసక్తి ఉన్న తమ పేర్లను జనసే పార్టీ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు.వెబ్ సైట్ ఇక్కడ ఉంది క్లిక్ చేయండి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేవారి కోసం ఇది. ఒక వేళ దరఖాస్తు వ్యక్తిగతంగా పొందాలనుకుంటే, శ్రీబాలాజీ రెసిడెన్సీ, 11/129, వినాయక్ చౌక్, సుభాష్ రోడ్, సప్తగిరి సర్కిల్, అనంతపుర,515001 అడ్రసుకు వెళ్ల వచ్చు. ఈ రోజు నుంచి ఏప్రిల్ నాలుగు దాకా అనంతపురం జిల్లావారు పేర్లను నమోదు చేసుకోవచ్చునని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.