ముందస్తు ఎన్నికలకు సిద్ధమని మొదటి ప్రకటన వెలువడింది. మనసులో మాట బయట పెట్టిన మొదటి నేత  జనసేనాని పవన్ కల్యాణ్ 

ఎన్నికల యుద్దం ఒక వేళ ముందస్తుగా వస్తే , జన"సేన" సిద్దమే అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ఈ విషయాన్ని ఎప్పటిలాగే ఆయన ట్వీట్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికల చర్చ మొదలయింది. ప్రధాని మోదీ నోట్ల రద్దు ప్రకటించినప్పడు ఈ ముందస్తు ఎన్నికల చర్చ మొదలయింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తర్వాత వూపందుకుంది.

దీనికి తోడు తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు ఎన్నికలకు సుముఖంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి.

 ఇలాంటి నేపథ్యంలో రేపో ఎల్లుండో ఇరువురు ముఖ్యమంత్రులు ఢిల్లీలో ప్రధానిని కలిసే అవకాశం ఉంది.

ఇద్దరు నేషనల్ డెవెలప్ మెంటు కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొనేందుకు డిల్లీ వెళ్లున్నారు.

 వారి మధ్య ఈ చర్చ వస్తుందని కూడా వూహాగాానాలు వినబడుతున్నాయి.

ఇలాంటపుడు పవన్ ఏక వాక్య ట్వీట్ వదిలారు.

"ఎన్నికల యుద్దం ఒక వేళ ముందస్తుగా వస్తే , జన"సేన" సిద్దమే" అన్నారు.