పవన్ కోసం ప్లెక్సీలను ఎర్పాటు చేసిన ఫ్యాన్స్ ప్లెక్సీలను చించేసిన దుండగులు ధర్నాకు దిగిన ఫ్యాన్స్
జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ప్లెక్సీ వివాదం విజయవాడలో చోటు చేసుకుంది. ఉద్దానం కిడ్నీ భాధితుల కోసం ఆయన నేడు సీఎం చంద్రబాబునాయుడితో సమావేశం కానున్నారు. అందుకు పవన్ కళ్యాన్ ప్యాన్స్ స్వాగతం పలుకుతూ, ప్లెక్సీలకు ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడలోని భవానీపురం శివాలయం సెంటర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది, పవన్ కళ్యాన్ ప్లెక్సీలను ద్వంసం చేశారని తెలుసుకున్న పవన్ ప్యాన్స్ అక్కడ ధర్నాకు దిగారు. స్థానిక పోలీసులు విషయం తెలుసుకొని ధర్నా ప్రాంతానికి చేరుకుని పవన్ ఫ్యాన్స్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పవన్ ప్యాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని వారు పరిశీలిస్తున్నారు. ప్లెక్సీలను చించేసిన వారిని గుర్తించిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
చంద్రబాబుతో సమావేశమయ్యే నిమిత్తం పవన్, విశాఖ నుంచి హార్వార్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లను తీసుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ఈ ఉదయం 12 గంటల సమయంలో ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్దానం భాధితుల గురించి సీఎంతో పవన్ చర్చించనున్నారు.
