మొట్టమొదటిసారిగా, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపక్ష వైసిపి ఎంపిలు కేంద్రంలో సాగిస్తున్న ప్రత్యేక హోదా పోరాటాన్ని ప్రశంసించారు.ప్రత్యేక హోదా విషయంలో వైసిపి ఎంపిలు ప్రశంసనీయంగా పనిచేస్తున్నారని అన్నారు. ఇది కొత్త రాజకీయ సమీకరణానికి దారి తీస్తుందా?
మొట్టమొదటిసారిగా, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిపక్ష వైసిపి ఎంపిలు కేంద్రంలో సాగిస్తున్న ప్రత్యేక హోదా పోరాటాన్ని ప్రశంసించారు.ప్రత్యేక హోదా విషయంలో వైసిపి ఎంపిలు ప్రశంసనీయంగా పనిచేస్తున్నారని అన్నారు.
ఆయన ఈ రోజు ఈ విషయం మీద ట్విట్టర్ఎక్కకుండా ఉండలేకపోయారు. ఎందుకంటే, ఈ విషయం మీద పార్లమెంటులో రగడ చేస్తున్నది ఇద్దరే. ఒకరు కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు,రెండోది వైసిపి ఎంపిలు.
తానుకూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నా , ఇలా పోరాటం చేస్తున్న వారితో కలసి ఐక్యంగా పోరాడేందుకు ఎపుడు కృషి చేయలేదు. కనీసం వారిని ప్రశంసించలేదు. ఇపుడు పవన్ ప్రతిపక్ష పార్టీని ప్రశంసించడం చర్చనీయాంశమయింది. దీనర్థం ఏమిటనే ప్రశ్న మొదలయింది.
వైసిపిని ప్రశంసించడేం కాదు, తెలుగుదేశం పార్టీ మీద ఆగ్రహం, అసంతృప్తి కూడ వ్యక్తం చేశారు.

‘ప్రత్యేకహాదా పై చర్చ జరుగుతుంటే టిడిపి ఎంపిలు సైలెంట్ గా ఉండడం దారుణం’ అన్నారు.
ఇచ్చిన హమీలు అమలు చెయ్యమని కేంద్రాన్ని టిడిపి ఎందుకు కోరడంలేదు’
‘ఆంద్రుల ఆత్మగౌరవమైన ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టోద్దని టిడిపిని కోరుతున్నాహోదా ఇస్తారనే నమ్మకంతోనే ఆంద్రులు టిడిపి, బిజేపిని గెలిపించారు’
‘నార్త్ ఎంపిల దగ్గర అవమానాలకు గురైన టిడిపి ఎంపిలు ప్రత్యేక హోదాని, రాష్ట్ర విభజనను మర్చిపోయారు’ అని ఆయన పరుషంగానే వ్యాఖ్యానించారు.
దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన టిఆర్ ఎస్ ఎంపి కె కేశవరావు, కాంగ్రెస్ ఎంపి అనంద్ భాస్కర్ పవన్ కొనియాడారు.
‘ప్రత్యేక హోదా పై మాట్లాడిన తెలంగాణా ఎంపిలకు దన్యవాదాలుప్రత్యేక హోదాపై వైసీపి పోరాటం అభినందనీయం, స్పూర్తిధాయకం...’ అన్నారు.
‘ప్రజాభీష్టం మేరకు వాళ్లు (కేంద్రం) ఉత్తర ప్రదేశ్ ను విభజించగలరా? ఈ సూత్రాన్ని కేవలం కింద దక్షిణాదిన అందునా ఎపికే వర్తింపచేస్తారా.’
‘కొంత సంయమనం ఉండాల్సిందే. కేంద్రంతో వ్యవహరించేటపుడు కొంత జాగ్రత్తగానే ఉండాలి.నేనొప్పుకుంటాను.పదే పదే అన్యాయానికి గురిచేస్తున్నపుడు అలా ఎలా ఉండాల్సిన అవసరమేమిటి?.’
‘ మీ వ్యక్తి గత ప్రయోజనాలకోసం ఆంధ్ర ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్ట వదు, అని నేను టిడిపి కోరుతున్నా.’ అని పవన్ హెచ్చరించారు.
