భూమా కుటుంబానికి పవన్ కు మంచి సంబంధాలున్నాయి. నంద్యాల ఎన్నికలలో భూమా కుటుంబానికి పవన్ అండ ఉంటుంది- అఖిలప్రియ

నిన్న పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రశసించిన తీరు చూశాక నంద్యాల తెలుగుదేశం వర్గాలలో కొంచెం ధైర్యం వచ్చింది. పవన్ కల్యాణ్ తప్పకుండా టిడిపి మద్దతునిస్తాడని, భూమా కుటుంబానికి అండగానిలుస్తాడనే విశ్వాసం ప్రబలింది. ఈ విషయాన్ని మంత్రి భూమా అఖిల ప్రియ స్వయంగా వెల్లడించింది. ఆమె ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. నంద్యాలలో ఈ మధ్నాహ్నం మీడియాతో మాట్లాడుతూ జనసేన నేత పవన్ కళ్యాణ్‌తో భూమా కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.

‘నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ మా కుటుంబానికి అండగా నిలుస్తారన్నారు,’ అని ధీమా వ్యక్తం చేశారు.

దీనికి కారణం నిన్నటి పవన్-చంద్రబాబుల మీటింగేనని వేరే చెప్పనవసరంలేదు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో కూడా పవన్- బాబు మీటింగ్ ఆనందాన్ని నింపింది. ఏషియానెట్ మాట్లాడిన పలువురు జిల్లా టిడపినేతలు చాలా నమ్మకంగా పవన్ మద్దతు గురించి చెప్పారు. పవన్ పార్టీకి తప్పక సహకరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది 2014 కొనసాగింపని కూడా ముక్తాయించారు.

నంద్యాల ప్రజలలో, ప్రతిపక్ష వైసిపిలో నేతలలో కూడా ఇదే అభిప్రాయం కనిపిస్తూ ఉంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నాడనే అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతూంది.అయితే, పవన్ నేరుగా రంగంలోకి దూకి టిడిపి అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తారా లేక పరోక్షంగా సహకారం అందిస్తారా అనేది తేలాల్సి ఉంది.