ఈ విషయంల పవన్ వెనబడటం అభిమానులకు నచ్చడం లేదు.  ఈ ప్రాజక్టు గురించి ఒక్క విషయం కూడా బయటకు పొక్కక పోవడం అభిమానులను బాగా నిరాశకు గురి చేస్తా ఉంది.

ఈ విషయంలో పవన్ కల్యాణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సెట్స్ కి వెళ్లిన సినిమా గురించి ఏ సమాచారం లేదు. కనీసం టైటిల్ కూడా బయటకు పొక్కడం లేదు.ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందో తెలియదు. దీనితో పవన్ అభిమానుల ఎదురు చూపులు భారమవుతున్నయి. దీనికి కారణం లేకపోలేదు.ఈ వేసవి ప్రారంభంలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రంతో పాటు పైసా వసూల్,జైలవకుశ సెట్స్ కి వెళ్లాయి. ఇవన్నీ దాదాపు ఒకే సారి నిర్మాణంలోకి వెళ్లాయి. అన్నీ భారీ చిత్రాలే. అయితే, ‘పైసా వసూల్’ యమజోరుగా ముందుకు పోతున్నది. షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు కూడా సిద్ధమైపోయింది. ఇప్పటికే పైసా వసూల్ ఫస్ట్‌లుక్, స్టంపర్ రిలీజయ్యాయి. త్వరలోనే ఈచిత్రం ఆడియో ఆవిష్కరణ ఏర్పాట్లు కూడా జరగుతున్నాయి.

 ఇక రెండో సెన్సేషన్ ‘జై లవకుశ’కు విషయానికొస్తే, లోగో వచ్చింది. ఫస్ట్‌లుక్స్ విడుదలయింది. ఒక టీజర్ కూడా దూసుకుపోతూ ఉంది. ఇంకో రెండు టీజర్ల తొందర్లో బయటకు వస్తాయంటున్నారు.

ఈ విషయంలో తమ హీరో వెనకబడటం వారికి నచ్చడం లేదు.

కానీ, ఇదే చిత్రాలతో పాటే సెట్స్‌పైకి వెళ్లిన పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ చిత్రం ఏమయింది? ఇదే పవన్ అభిమానుల నిరాశకు కారణం.

అయితే, ఈ సస్పెన్స్ కు తొందర్లోనే తెరపడుతుందని ఒక అనధికారిక వార్త.

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా పవన్-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచింగ్ ఏర్పాట్లు చడీ చప్పుడు లేకుండా జరుగుతున్నాయని చెబుతున్నారు. అప్పుడే టైటిల్ కూడా ప్రకటిస్తారని చిత్ర నిర్మాణంలోని పాలుపంచుకుంటున్న వర్గాల సమాచారం. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘రెండు మూడు రోజులలో సస్పెన్స్ ను క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఒక ప్రకటన కూడా రావచ్చు,’ అని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీర్ బాబు, గోపాలకృష్ణ, పరదేశ ప్రయాణం వంటి టైటిళ్లు ను ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారని వినికిడి. వీటిలో ఏదైనా ఒక టైటిల్‌ను ఫైనల్ చేస్తారా లేక అల్ టు గెదర్ కొత్త ట్రెండ్ టైటిల్ కు వెళతార అనేదిచూడి.