సీరియల్  ట్వీట్ లలో భాగంగా శనివారం నాడు బిజెపి ‘దేశభక్తి ’ డెఫినిషన్ను పవన్ కల్యాణ్  నుజ్జు నుజ్జు చేశారు.

కాషాయం బ్రాండ్ దేశ భక్తి మీద జనసేనాని పవన్ కల్యాణ్ కొరడా ఝళిపించారు.

సీరియల్ ట్వీట్ లలో భాగంగా శనివారం నాడు బిజెపి దేశభక్తి డెఫినిషన్ నుజ్జు నుజ్జు చేశారు. ఒకపార్టీ కళ్లద్దాలనుంచి కనిపించేది దేశభక్తి కానేకాదుపొమ్మన్నారు.

ఇలా ఇంత ఘాటుగా బిజెపి తరహా దేశభక్తిని ఈ మధ్య కాలంలో మెయిన్ స్ట్రీమ్ రాజకీయనాయకులెవరూ మోదీ నాయకత్వంలోని బిజెపిని ఇలా తోసిపుచ్చలేదు. బిజెపితో ఎపుడు ఏమి అవసరమొస్తుందోనని నీళ్లునమలడం కాంగ్రెసేతర పార్టీలన్నింటిలో కనిపిస్తుంది. ఇలాంటపుడు పవన్ శనివారం ప్రయోగించిన ట్వీట్ చాలా బలమయిందనే చెప్పాలి.

'కులం, మతం, జాతి, ప్రాంతం, వర్గం, భాషాతీతంగా ఒక వ్యక్తిగానీ, రాజకీయ పార్టీగానీ వ్యవహరించినపుడే నిజమైన దేశభక్తి కనిపిస్తుంది,’ అని అని పవన్ అన్నారు.

ఇవిగో పవన్ శనివారం ట్వీట్లు :


'ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అభిప్రాయంతోగానీ, విధానంతోగానీ విభేదిస్తే.. వారిని దేశద్రోహులుగా ముద్ర వేయకూడదు. ఇకవేళ వారు తమ ప్రత్యర్థుల గురించి తీవ్ర అభిప్రాయాలు వెల్లడించినా.. వారి గొంతును నులిమివేయకుండా మొదట వారు చెప్పేది వినాలి. ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా హడావిడిగా చర్యలు తీసుకుంటే జేఎన్‌యూ విద్యార్థులపై 'దేశద్రోహం' కేసు మాదిరిగానే ఎదురుదెబ్బ తగిలే అవకాశముంటుంది. జేఎన్‌యూ విద్యార్థుల కేసులో చివరకు వారి వీడియో కావాలని మార్చినట్టు తేలింది' అని అన్నారు.

‘నిజమయిన దేశభక్తి మానవీయ విలువలను పుడుతుంది. అది అన్ని కోణాలను స్పృశిస్తుంది.’

‘ ప్రజాస్వామిక వ్యవస్థలో పాలక పార్టీని విబేధించడాన్కి దేశవ్యతిరేక ముద్ర వేయడానికి వీల్లేదు. ఒక వేళ అలాంటి తీవ్రమయిన పోకడ పోవాలనుకున్నా అవతలి వాళ్లు చెప్పేదాని, వాళ్ల గొంతునొక్కకుండా వినాలి, తర్వాత చర్యలు తీసుకోవాలి. తొందర పడి ఏదయిన చర్యతీసుకుంటే అది జెఎన్ టియు (ఇది జెఎన్ యు అని వఉండాలి తప్పయిందని పవన్ తర్వాత క్షమాపణలు చెప్పారు) విద్యార్థుల దేశ ద్రోహ కేసులా గ బెడిసి కొడుతుంది. ఈకేసులో ఏమయింది, చూపించినవన్నీ బోగస్ టేపులేనని బయటపడింది.’

'కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ ఆస్వాదించాల్సిన సాయంకాలాన్ని 'దేశభక్తి' ని నిరుపించేకునే పరీక్షకు వేదికగా మార్చకూడదు.‘

‘రాజకీయ పార్టీలు తమ సభల్లో మొదట జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించవు? దేశంలోని ఉన్నత కార్యాలయాల్లో ఎందుకు ఆలపించడం లేదు? చట్టాలను అమలుచేయాలని ప్రబోధించే వారు మొదట తాము మార్గదర్శకంగా ఉండి ఇతరులు అనుసరించేలా చేయవచ్చు కదా.’

'ఇవన్నీ చూస్తుంటే, “నిజాయితీపరులకు చట్టాలను ఉచ్చుగా మార్చి, మోసగాళ్ల మజా చేస్తున్నారా వాటిని బొనంజా చేస్తున్నారా” అన్న అమెరికా ఆర్థికవేత్త థామస్‌ సోవెల్‌ వ్యాఖ్య గుర్తొస్తున్నది.

ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తానని ఆయన ట్వీట్‌ చేశారు.