మార్కెట్లోకి పతంజలి జీన్స్

First Published 6, Apr 2018, 2:56 PM IST
Patanjali jeans? Baba Ramdev says it's coming in 2019
Highlights
స్వదేశీ బ్రాండ్ తో మార్కెట్లోకి పతంజలి

మార్కెట్లోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే తనదైన ముద్ర వేసుకొని దూసుకుపోతోంది పతంజలి. ప్రముఖ యోగా గురువు రాం దేవ్ బాబా దీనికి సహ వ్యవస్థాపకులు అన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. తాజాగా పతంజలి వస్త్ర ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతోంది. వచ్చే సంవత్సరం నుంచి పతంజలి నుంచి జీన్స్ , ఇతర దుస్తులు వస్తాయని రాందేవ్ బాబా తెలిపారు.
మార్కెట్లోకి మీ కంపెనీకి చెందిన జీన్స్ ఎప్పుడు తీసుకొస్తున్నారు? అని కొంతమంది ప్రజలు తనను అడుగుతున్నట్లు ఆయన చెప్పారు.  ఈ నేపథ్యంలో గార్మెంట్ ఉత్పత్తులను లాంచ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. చిన్నపిల్లలు, మహిళలు, పురుషులకు సంప్రదాయ వస్త్రాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వచ్చే ఏడాది తమ పతంజలి దుస్తులు మార్కెట్లోకి అడుగుపెడతాయని అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన గోవా ఫెస్ట్-2018 కార్యక్రమంలో రాందేవ్ పేర్కొన్నారు. 

ఇప్పటికే కాస్మెటిక్, ఆహార పదార్థాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చామని స్పోర్ట్స్, యోగా కోసం అవసరమైన దుస్తులను తమ కంపెనీ ఆవిష్కరిస్తుందని బాబా చెప్పారు. స్వదేశీ బ్రాండ్‌తో దుస్తుల తయారీ వ్యాపారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని గతేడాది ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.

loader