రక్షణ శాఖ తమ ఆధ్వర్యంలోని సీఎస్‌డీ ( క్యాంటిన్ స్టోర్ డిపార్ట్ మెంట్) క్యాంటీన్లలో ఈ ఆమ్లా జ్యూస్ ను విక్రయించడంపై నిషేధం విధించింది.

కోల్‌కతా సెంట్రల్ ఫుడ్ ల్యాబ్…

ఈ పేరెప్పుడైనా విన్నారా.... పోనీ, మ్యాగీ నూడుల్స్ పేరు విన్నారా కదా... రుచి కూడా చూశారు కదా... అప్పుడెప్పుడో అందులో ప్రమాదకర రసాయనాలున్నాయని చెబితే కొన్నాళ్లు మ్యాగీ ఉపవాసం కూడా చేశారు కదా...

అలా మ్యాగీని మన నుంచి తత్కాలికంగా దూరం చేసి నెస్లే సంస్థకు కోట్ల రూపాయిల నష్టం తీసుకొచ్చిన సంస్థే కోల్ కతా సెంట్రల్ ఫుడ్ ల్యాబ్.

మ్యాగీ నూడుల్స్ లో పరిమితికి మించి సీసీం (లెడ్), మోనో సోడియం గ్లూటమేన్ ఉన్నాయని ఈ ల్యాబ్‌ పరీక్షల్లో నే వెల్లడైంది.

ఇప్పుడు ఇదే సంస్థ ప్రముఖ యోగా గురు బాబారాం దేవ్ కు చెందిన పతంజలి స్టోర్స్ మీద పడింది.

ఈ సంస్థ అమ్ముతున్న ఆమ్లా జ్యూస్ పై కూడా కోలకత్ ల్యాబ్‌ అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో అప్రమత్తమైన రక్షణ శాఖ తమ ఆధ్వర్యంలోని సీఎస్‌డీ ( క్యాంటిన్ స్టోర్ డిపార్ట్ మెంట్) క్యాంటీన్లలో ఈ ఆమ్లా జ్యూస్ ను విక్రయించడంపై నిషేధం విధించింది. అంతేకాదు ఇప్పటి వరకు దేశంలోని సీఎస్ డీ క్యాంటీన్లలో నిల్వ ఉన్న ఆమ్లా జ్యూస్ ను వెనక్కి పంపాలని ఆదేశించింది.

కోల్‌కతా సెంట్రల్ ఫుడ్ ల్యాబ్ నివేదిక ఆధారంగాగానే సీఎస్‌డీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో వ్యాపార రంగంలో భారీస్థాయిలో దూసుకెళ్తున్న పతంజలి ప్రొడెక్టుపై గతంలో కూడా పలు ఆరోపణలొచ్చాయి.