train

పాట్నా:రైలు బాత్‌రూమ్‌లోనే ఓ వ్యాపారి మరణించాడు. ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో సుమారు 72 గంటల పాటు రైలులోనే ఆ మృతదేహం ఉంది. రైలును శుభ్రపర్చేసమయంలో బాత్ రూమ్‌లో ఉన్న శవాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. అప్పటికే ఆ మృతదేహం కుళ్ళిపోయింది.

 ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ కుమార్ అగర్వాల్ అనే వ్యాపారి ఈ నెల 24వ తేదిన పాట్నా- కోట ఎక్స్‌ప్రెస్ రైలులో ఆగ్రాకు బయలుదేరారు. రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలోనే అతడు అనారోగ్యానికి గురయ్యాడు. ఇదే విషయాన్ని ఆయన ఫోన్‌లో భార్యకు సమాచారాన్ని ఇచ్చాడు.


భార్యతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత సంజయ్ కుమార్ అగర్వాల్ బాత్రూమ్ కు వెళ్ళాడు. అదే సమయంలో ఆయన భార్య ఫోన్ చేసింది. కానీ, ఆయన ఎంతకీ పోన్ లిఫ్ట్ చేయలేదు.
 బాత్రూమ్‌లోనే సంజయ్ గుండెపోటుతో మరణించాడు. అయితే ఈ విషయాన్ని ఎవరూ కూడ గుర్తించలేదు.సుమారు 1500 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణం చేసింద చివరగా రైలు పాట్నాకు చేరుకొంది. పాట్నా చివరి స్టేషన్ కావడంతో రైలును శుభ్రపర్చేందుకు తరలించారు.

రైలును శుభ్రపరుస్తుండగా బాత్రూమ్‌లోనే సంజయ్ అగర్వాల్ మృతదేహం కన్పించింది. అప్పటికే అతను మరణించి 72 గంటలు కావడంతో దుర్వాసన వస్తోంది.మృతుడి జేబులోని ఫోటో ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.