Asianet News TeluguAsianet News Telugu

కొడుకు ఇంటిముందే తల్లిదండ్రుల ఆందోళన

  • తల్లిదండ్రుల ఆలన పాలన ను మరిచిన కొడుకు
  • కొడుకు ఇంటిముందే తల్లిదండ్రుల ఆందోళన
parents strike behind son house in badradri kothagudem distict

నవమాసాలు పోసి ఆ తల్లి జన్మనిచ్చింది. కంటికి రెప్పలా కాపాడి విద్యాబుధ్దులు చెప్పించి ప్రయోజకున్ని చేశాడు ఆ తండ్రి.   అయితే ఉద్యోగంలో స్థిరపడి, పెళ్లి చేసుకున్న ఆ కొడుకు మాత్రం తల్లిదండ్రుల ఆలన పాలన మరిచాడు. వారికి అండగా ఉండాల్సిన సమయంలో వారిని రోడ్డుపాలు చేశాడు. దీంతో కన్న కొడుకు ఉండి కూడా దిక్కులేని దుర్భర స్థితిలో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే  పాల్వంచ మండలం గుట్టాయగూడెంకు చెందిన తల్లిదండ్రులు తమ కొడుకు ఇంటి ముందు ధర్నాకు దిగాడు.  తమపై కొడుకు కనీస జాలి చూపడంలేదని,   నిత్యం అవమానాలకు గురి చేస్తున్నాడని ఆ తల్లిదండ్రులు ఆవేధన వ్యక్తం చేశాడు. కట్టుకున్న భార్యతో కలిసి ఇంటి నుంచి గెంటేశాడని, ఎటుపోవాలో తెలియక ఈ కొడుకు ఇంటి ముందు ధర్నాకు దిగామని వారు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios