ఇన్నాళ్లకి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మొగం పోస్టర్ల కెక్కింది
సినిమాపోస్టర్ల లాగా రాజకీయపార్టీల పోస్టర్లలో చాలా సందేశం ఉంటుంది.
పోస్టర్లలో ఉన్న నాయకుడిపోటో పక్కన ఎవరిఫోటో ఉంది, ఎవరి ఫోటో లేదు, ఫోటోల సైజు... అన్నింటికి రాజకీయార్థాలుంటాయి. ఎపుడూ పోస్టర్ కెక్కని ఒక వ్యక్తి హఠాత్తుగా పార్టీ పోస్టర్లో అందునా నాయకుడి పక్కనే తన ఫోటో ముద్రించుకున్నాండంటే చాలా అర్థముంటుంది. ఆయన పెద్ద మనిషయినట్టే లెక్క.
ఇపుడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఫోటో ఇపుడు పోస్టర్లలో ప్రత్యక్షమయి చర్చనీయాంశమయింది. ఫోస్టర్లో బొమ్మేయించుకునే ధైర్యం ఇపుడొచ్చిందాయనకు.
తమిళ నాడు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వమ్ కు ఎఐడిఎంకె రాజకీయాలలో పట్టుదొరికినట్లుంది. వానపాముపాముగా మారుతున్నట్లుంది.గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఇటీవల మళ్లీ ముఖ్యమంత్రి అయినా, ఆయనకెపుడు ఎఐఎడిఎంకె పార్టీ ఎపుడూ ఆయన బొమ్మతో పోస్టర్లు విడుదల చేయలేదు.
జయలలిత పదవిలో ఉన్నా, లేకపోయినా, పార్టీ పోస్టర్ల లో ‘అమ్మ’ కు తప్పమరొకరిచో టుండేది కాదు. తన ఫోటో తప్ప పార్టీ ప్రచార సామాగ్రి మీద మరొకరిఫోటో కనిపిచకుండా ఆమె కట్టుదిట్టం చేశారని చెబుతారు. పోస్టర్లలో కనిపించే మరొక ఫోటో ఎంజిఆర్ దే.
జయలలిత చనిపోయాక, ముఖ్యమంత్రి బాధ్యతుల మూడో సారి చేపట్టాక ఆయన ఒక రౌండు ఢిల్లీ కూడా వెళ్లివచ్చారు. అంతే, ఆయనలో, ఆయన అభిమానుల్లో మార్పు కనిపిస్తూఉంది. అభిమానులు వేసే పోస్టర్లో చిద్విలాసంతో ఉండే ఫోటోలు ప్రత్యక్ష మవుతున్నాయి. ఎఐఎడిఎంకె కార్యకర్తలు వేసే పోస్టర్ లో జయలలిత కాకుండా మరొకరి ఫోటో కనిపించడం ఇదే ప్రథమం అని చెబుతున్నారు.
ఇలాగే జయలలిత నెచ్చెలి శశికళ కూడా పోస్టర్ల కెక్కింది. అయితే, ఈ పోస్టర్ల నుంచి ఎవరో ఆమె ముఖం దగిర చించేయడమో, కందెన పూయడమో జరిగింది. చాలా పోస్టర్ల లో శశికళ ముఖాన్ని చెరిపేయడానికి చాలా రాజకీయార్థం ఉందంటున్నారు విజ్ఞులు.
