హైదరాబాద్ లోని పంజాగుట్ట లలితా జ్యువెల్లరీ లో వారం రోజుల క్రితం భారీ దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ఈ దొంగతనానికి పాల్పడిన నింందితులిద్దరిని ఇవాళ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

 ఈ చోరీకి సంభందించిన వివరాల్లోకి వెళితే పంజాగుట్టలోని లలితా జువెల్లరీ షాప్ లో ఇద్దరు మహిళలు బురఖా ధరించి వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.6 లక్షల విలువ చేసే బంగారా హారాన్ని దొంగిలించి ఆ స్థానంలో రోల్డ్ గోల్డ్ బంగారుహారాన్ని పెట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సిబ్బంది సీసీటీవీ పుటేజిని పరిశీలించారు. ఇందులో దొంగతనానికి పాల్పడుతున్న వీడియో రికార్డయి వుంది. దీంతో సిబ్బంది ఈ దొంగతనంపై పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు.

సీసీ పుటేజిలో దొంగతనానికి పాల్పడుతున్న మహిళలు బురఖా ధరించి ఉండటంతో పోలీసులు వారిని గుర్తించలేకపోయారు. అయితే  అత్యంత చాకచక్యంగా కేసును ముందుకు నడిపిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను అరెస్ట్ చేశారు.