వైఎస్ ఆర్ మీద నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

First Published 26, Nov 2017, 5:37 PM IST
panchayat minister nara lokesh alleges ysr undermined panchayats with meager allocations
Highlights
  • నిధులు  సరిగ్గా కేటాయించక వైఎస్ ఆర్ పంచాయతీలకు హాని చేశాడు. 
  • ఇది ఆయన అనుభవం రాహిత్యం
  • దాని వల్లే నాకు కష్టాలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుభవ రాహిత్యం వల్ల ఈ రోజు తాను కష్టాలు పడుతున్నానని  పంచాయతీ ఐటి  శాఖ మంత్రి నారాలోకేశ  సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్  రాజశేఖర్ రెడ్డి మీద బహుశా  ఇలాంటి వ్యాఖ్యలు ఇంతవరకు ఎవరూచేయలేదేమో. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేయలేదు.  ‘అనుభవం లేని ముఖ్యమంత్రి గతవంలో ఉండి ఉంటే ఇలాంటి కష్టాలొస్తాయి. నాలాంటి వాళ్లు ఇపుడు ఇలా కష్టాలు పడుతున్నది ఆయన వల్లే,’ అని ఆయన నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు  పంచాయితీలను బాగా నిర్లక్ష్యం చేశారు. పంచాయతీలకు అవసరమైన నిధులు కేటాయించ లేదు. దాని వల్లనే ఈరోజు నేను బాధపడుతున్నాను,’ అని అన్నారు.

‘రాజశేఖర్ రెడ్డి  గనక అరోజుల్లోనే  తగిన నిధులు పంచాయతీలకు  కేటాయించి ఉంటే, ఈరోజు పరిస్థితి దాపురించి ఉండేది కాదు,’లోకేష్ అన్నారు.

‘ ఏమాత్రం పాలనా అనుభవం లేని ముఖ్యమంత్రుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి,’ పంచాయతీ రాజ్ మంత్రి  వైయస్ఆర్  పై విరుచుకుపడ్డారు.

 

 

 

 

loader