బలపరీక్షలో నెగ్గిన పళనీస్వామి

తమిళనాడు సీఎం ఎవరో తెలిసి పోయింది. అరుపులు, హైడ్రామాల మధ్య కొనసాగిన బలపరీక్షలో చివరకు పళనిస్వామి నెగ్గింది.వాయిదాల మధ్య మళ్లీ 3 గంటలకు మొదలైన అసెంబ్లీ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేను సభ నుంచి బహిష్కరించి స్పీకర్ ఓటింగ్ పెట్టారు.

దీంతో శశికళ వర్గం, పన్నీరు వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు.

ప్రధాన ప్రతిపక్షం లేకపోవడంతో చాలా సులువుగా పళని స్వామి వర్గం బలపరీక్షలో నెగ్గింది. పన్నీరుకు అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, వ్యతిరేకంగా కేవలం 11 మంది మాత్రమే ఓటు వేశారు.

దీంతో అమ్మ గెలిచిందంటూ అన్నా డీఎంకే నేతలు సభలో ఆనందంతో నినాదాలు చేశారు. కాగా, పన్నీరు సెల్వం వర్గం అసెంబ్లీ బయట నిరసన తెలుపుతోంది. మరో వైపు డీఎంకే దళపతి స్టాలిన్ సభలో జరిని అవమానం పై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.