పాకిస్తాన్ లో ఏమి జరుగుతున్నదో చూడండి. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్  ఈ రోజు సుప్రీంకోర్టు నియమించిన జాయింట్  ఇన్వెస్ట్ గేషన్ టీమ్ ( జిట్ ) ముందు హాజరయ్యారు.  పాకిస్తాన్ చరిత్రలో ఇలా ఒక ప్రధాని కోర్టు ఆదేశాల మేరకు ఒక దర్యాప్తు కమిటి ముందుకు హజరవడం ఇదే ప్రధమం.


నవాజ్ షరీఫ్ ఎందుకు సిట్ ముందు హాజరయ్యారో తెలుసా?

 

ఆయన మీద అవినీతి ఆరోపణలొచ్చాయి. పనామ్ పేపర్స్ అని  ఆమధ్య ఒక భారీ అంతర్జాతీయ కుంభకోణం వెల్లడయింది చూశారూ. వాటిలో నవాజ్ షరీఫ్ పేరుకూడా వచ్చింది. ఇది అవినీతి వ్యవహారమని దీని మీద విచారణ జరగాల్సిందేనని ప్రధాని అయినా  జిట్ ముందుకు రావలసిందేనని సుప్రీంకోర్టు చెప్పింది.

 

జిట్ ముందు  హాజర్యే ముందు షరీఫ్ తన సలహాదారులతో, కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు.
 

షరీఫ్ చాలా హుందా గా కోర్టు నియమించిన కమిటీ ముందుకు వచ్చారు. తన తో పాటు వచ్చి, జిందాబాద్ నినాదాలిచ్చి  రభస చేయకుండా ఉండేందుకు ఆయన పార్టీ కార్యకర్తలెవరు తనతో జిట్ ఉన్న ఇస్లామాబాద్ జ్యుడిషియల్ అకాడమీ  దగ్గిరకు రావద్దని చెప్పారు.

 

గత శనివారం నాడు కజఖ్ స్తాన్ నుంచి తిరిగిరాాగానే ఆయన జిట్ సమన్లు అందించారు.మరొక ముఖ్యమయిన విషయం, ఈవిచారణ కూాడా చాాలా వేగంగా ఈ స్థాయికి వచ్చింది.

 

 మనీలాండరింగ్ కు పాల్పడి, ఆడబ్బుతో లండన్ లో  విలాసవంతమయిన పార్క్ లేన్ లో నాలుగు అపార్ట్ మెంట్లు కొన్నాడనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. దీనిపై విచారణ చేసేందుకు ఏప్రిల్ 20న పాకిస్తాన్ సుప్రీంకోర్టు జిట్ ను ఏర్పాటుచేసింది.

 

 ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమారులతో పాటు, ఎవరినైనా విచారణ సమన్ చేసే అధికారాన్ని కోర్టు జిట్ అందించింది.ప్రధాని షరీఫ్ తానేమీ తప్పు చేయలేదని పేర్కొన్నారు.

 

ఇంతకు ముందు, అక్రమ వ్యాపారాల ఆరోపణ ల మీద  షరీఫ్ కుమారులు, హుసేన్, హసన్ లనుకూడా జిట్  విచారించింది.హుసేన్ ను ఐదుసార్లు, హసన్ ను రెండు జిట్ విచారణ రప్పించింది.ఈ నేరాలన్నీంటిన నవాజ్ షరీఫ 1990 దశకంలో ప్రధాని గా ఉన్నపుడుచేశారట.

 

జిట్ తన విచారణను 60 రోజులలో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిచింది.

 

జూన్ 17న నవాజ్ షరీఫ్ తమ్ముడు, పంజాబ్ ముఖ్యమంత్రి అయిన షాహాబ్జ్ షరీఫ్ జిట్ ముందు హాజరవుతున్నారు.