క్యూబాలో కుప్పకూలిన విమానం: 100 మందికి పైగా దుర్మరణం

Over 100 killed in passenger plane crash in Cuba
Highlights

క్యూబాలో ఘోర విమానప్రమాదం జరిగింది. బోయింగ్ 737 విమానం శుక్రవారం కుప్పకూలింది.  ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు.  

హవానా: క్యూబాలో ఘోర విమానప్రమాదం జరిగింది. బోయింగ్ 737 విమానం శుక్రవారం కుప్పకూలింది.  ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. శిథిలాల కింది నుంచి ముగ్గురిని ప్రాణాలతో వెలికి తీశారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

హవానాలోని జోస్‌ మార్టి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. హోల్గున్‌కు చేరుకోవాల్సిన విమానం బోయ్‌రోస్‌, శాంటియాగో డీ లావెగాస్‌ గ్రామాల మధ్య పొలాల్లో కుప్పకూలింది.

 ఈ బోయింగ్‌ 737 విమానంలో 104 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం గురించి తెలియగానే క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్‌ డియాజ్‌ కానెల్‌ సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

మృతదేహాలు గుర్తిస్తున్నట్లు అధ్యక్షుడు చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియడం లేదు. ఈ బోయింగ్ 737 - 201 ఎయిర్ క్రాఫ్ట్ ను 1979లో తయారున చేశారు. దీన్ని దామోఝ్ అనే చిన్నపాటి కంపెనీ నుంచి క్యూబ్ ఎయిర్ లైన్ క్యూబానా లీజుకు తీసుకుంది.

loader