Asianet News TeluguAsianet News Telugu

నాలుగు ఇనిస్టిట్యూట్స్ తో ఒప్పందం కుదర్చుకున్న ఉస్మానియా

  • ఉస్మానియా విశ్వవిద్యాలయం.. విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
  • మరింత ఎక్కువ సమాచారం వారికి అందిచాలని విశ్వవిద్యాలయ  నిర్వాహకులు భావిస్తున్నారు
Osmania University signs MoU with 4 institutions

 

ఉస్మానియా విశ్వవిద్యాలయం.. విద్యార్థుల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీలో వారు నేర్చుకునే దాని కన్నా మరింత ఎక్కువ సమాచారం వారికి అందిచాలని విశ్వవిద్యాలయ  నిర్వాహకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉస్మానియా యూనివర్శిటీ..  నాలుగు సంస్థలతో ఒప్పందం కుదుర్చకుంది.

 డిపార్ట్ మెంట్ సోషియాలజీ.. అండ్  నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్  కోసం ఉస్మానియా ఒక ఒప్పందం కుదుర్చకుంది. దీని వల్ల విద్యార్థులు ఉమ్మడి పరిశోధన మెళకువలను పొందగలుగుతారని యూనివర్శిటీ నిర్వాహకులు చెబుతున్నారు.

కామర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో రెండో ఒప్పందం కుదర్చకున్నారు. దీని వల్ల  కామర్స్ విద్యార్థులు .. వారి సాధరణ డిగ్రీతోపాటు.. ఇన్సూరెన్స్ పై పూర్తి పట్టు సాధించగలిగే అవకాశం ఉంది.

విద్యార్థుల్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ పెంచాలని ఉస్మానియా యూనివర్శిటీ భావించింది. దీనిలో భాగంగానే.. సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ పేటెంట్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్ తో మూడో ఒప్పందం కుదుర్చుకుంది.

డీఎన్ ఏ టెక్నాలజీపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సీపీఎంబీ అండ్ జెనోమీ ఫౌండేషన్ తో నాలుగో ఒప్పందం కుదుర్చకుంది.

ఈ నాలుగు ఇనిస్టిట్యూట్స్ తో  ఒప్పందం కుదుర్చుకోవడం కారణంగా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని యూనివర్శిటీ భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios