ఆర్కుట్ మళ్లీ వచ్చేస్తోంది..

First Published 12, Apr 2018, 10:04 AM IST
Orkut founder launches ‘hello’ social network app in India
Highlights
హలో అంటున్న ఆర్కుట్

‘ ఆర్కుట్’ పేరు గుర్తుందా..? ఒకప్పుడు సోషల్ మీడియాలో  దుమ్మురేపింది. దాదాపు పదేళ్ల పాటు ఏకచక్రాదిపత్యం కొనసాగించింది. ఆ తర్వాత ఫేస్ బుక్, ట్విట్టర్ అడుగుపెట్టడంతో జనాలు వాటికి ఆకర్షితులయ్యారు.ముఖ్యంగా ఫేస్ బుక్ పోటీని ఆర్కుట్ తట్టుకోలేకపోయింది. దీంతో..  2014 సెప్టెంబరు 30తో పూర్తిగా ఆర్కుట్‌ సేవలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో గూగుల్‌ మాజీ ఉద్యోగి, ఆర్కుట్‌ వ్యవస్థాపకుడు బయూకాక్‌టెన్‌ ‘హలో’ పేరుతో మరో సామాజిక మాధ్యమ వేదికను బుధవారం భారత్‌లో ప్రారంభించాడు. ముఖ్యంగా నేటి మొబైల్‌ జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘హలో’ను తీసుకొచ్చారు.

‘‘మీ చుట్టు పక్కల ఉన్న వారిని మీ అభిరుచులకు అనుగుణంగా దగ్గర చేస్తూ, సానుకూల, అర్థవంతమైన, విశ్వసనీయ, దృఢమైన సామాజిక అనుసంధాన వేదిక ‘హలో’. వాస్తవ ప్రపంచంలోని వారిని కలిపేలా ‘హలో’ను తీర్చిదిద్దాం. ఈ సామాజిక మాధ్యమ వేదిక ఇష్టం(లైక్‌)పై కాకుండా, ప్రేమ(లవ్‌)పైనిర్మించాం.  భారత్‌కు ‘హలో’ చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని ‘హలో’ సీఈవో బయూకాక్‌టెన్‌ అన్నారు. శాన్‌ఫ్రాన్సికో వేదికగా ‘హలో’ కార్యకలాపాలను నిర్వహించనుంది. ఇప్పటికే బ్రెజిల్‌లో అందుబాటులోకి వచ్చిన ‘హలో’ మిలియన్‌ డౌన్‌లోడ్‌లను దాటింది. భారత్‌లో గత కొన్ని నెలలుగా బీటా వెర్షన్‌ను పరీక్షిస్తున్నారు. ప్రతి నెలా 320 గంటలపాటు యూజర్లు ‘హలో’లోను వినియోగిస్తున్నారని పరీక్షలో భాగంగా గుర్తించారు. ప్రస్తుతం యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌లలో ఈ యాప్‌ అందుబాటులో ఉంది.

loader