చైనాలోని ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. తమ కంపెనీకి చెందిన ఫోన్ ధర తగ్గించింది.  ఒప్పోఆర్9ఎస్ ఫోన్ ధరపై రూ.1828 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఒకసారి ఇదే ఫోన్ ఫై రూ.1598 తగ్గించింది. కాగా.. ఇప్పుడు మరోసారి ధరపై కోత విధించింది. ఈ ఫోన్ ని 2016 అక్టోబర్ లో విడుదల చేశారు. దీని తర్వాత ఒప్పో నుంచి లేటెస్ట్ మొబైల్స్ చాలానే వచ్చాయి. దీంతో.. ఈ సిరీస్ ఫోన్ల అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ధరను తగ్గించారు.

ఒప్పో ఆర్9ఎస్ ఫోన్ ఫీచర్లు..

5.50 ఇంచెస్ టచ్ స్ర్కీన్

1080*1920 పిక్సెల్స్ రెజల్యూషన్

64జీబీ స్టోరేజీ

3010 బ్యాటరీ సామర్థ్యం

2గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

16మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా

16మెగా పిక్సెల్ వెనుక కెమేరా

4జీబీ ర్యామ్

ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్