ఒప్పో నుంచి మరో తాజా స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలో

Oppo F7 with notch style display launched at Rs 21990
Highlights

ఐఫోన్ ఎక్స్ ఫీచర్లతో.. ఒప్పో స్మార్ట్ ఫోన్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో.. భారత మార్కెట్లోకి మరో తాజా స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఒప్పో ఎఫ్7 పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ ఫీచర్లు.. వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకోనున్నాయి.

6.23 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ ఎక్స్ తరహాలో నాచ్‌ను అమర్చారు. ఇక ఫోన్ ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్ ఈ ఫోన్‌లో లభిస్తుంది. ఫోన్‌లో మెమొరీ కార్డుతోపాటు రెండు సిమ్ కార్డుల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా స్లాట్లు ఇచ్చారు. రెండు సిమ్ కార్డులు కూడా వీవోఎల్‌టీఈని సపోర్ట్ చేస్తాయి. 

64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఒప్పో ఎఫ్7 వినియోగదారులకు రూ.21,990, రూ.26,990 ధరకుల లభిస్తున్నది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ మాత్రం ప్రత్యేకంగా ఒప్పో స్టోర్స్‌ లోనే లభ్యం కానుంది. ఇక ఏప్రిల్ 2వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌ తోపాటు దేశంలో ఉన్న 777 ఒప్పో స్టోర్స్‌లో 24 గంటల పాటు నిర్వహించనున్న ప్రత్యేక ఫ్లాష్ సేల్‌లో ఒప్పో ఎఫ్7ను విక్రయించనున్నారు. మొదటి 10వేల ఫోన్లను ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 5 శాతం క్యాష్ బ్యాక్‌ను అందివ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌పై జియో 12 నెలలకు గాను రూ.1200 క్యాష్‌బ్యాక్‌ను, 120 జీబీ అదనపు 4జీ మొబైల్ డేటాను అందివ్వనుంది. అలాగే ఏడాది కాలం పాటు వన్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను కూడా ఈ ఫోన్‌తోపాటు అందివ్వనున్నారు. 

ఒప్పో ఎఫ్7 ఫీచర్లు... 
6.23 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

loader