ప్రస్తుతం వన్ ప్లస్ 5టీ స్టార్ వార్స్ లిమిటెడ్ ఎడిషన్ వేరియెంట్‌ను కూడా వన్‌ప్లస్ లాంచ్ చేసింది.
చైనాకు చెందిన మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ వన్ ప్లస్.. స్టార్ వార్ ఎడిషన్ ని విడుదల చేసింది. గత కొద్ది రోజుల క్రితమే వన్ ప్లస్ 5టీ ఫోన్ ని విడుదల చేసిన విషయం విదితమే. గత వారం కిందటి నుంచే ఈ ఫోన్ ఓపెన్ సేల్లో లభిస్తున్నది. అయితే వన్ ప్లస్ 5టీ కేవలం మిడ్నైట్ బ్లాక్ రంగులో మాత్రమే విడుదల కాగా తాజాగా లావా రెడ్ కలర్ వేరియెంట్ను వన్ప్లస్ విడుదల చేసింది.
ప్రస్తుతం వన్ ప్లస్ 5టీ స్టార్ వార్స్ లిమిటెడ్ ఎడిషన్ వేరియెంట్ను కూడా వన్ప్లస్ లాంచ్ చేసింది. ఈ వేరియెంట్ వెనుక భాగంలో తెలుపు రంగు ఉంటుంది. సైడ్లో ఉండే బటన్ను రెడ్ కలర్లో ఇచ్చారు. ఇక ఈ వేరియెంట్ కూడా 6/8 జీబీ ర్యామ్ మోడల్స్ లో లభిస్తున్నది. వీటిని రూ.32,999, రూ.37,999 ధరలకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. కాగా ఫీచర్లు కూడా ఈ వేరియెంట్లో ఏమీ మారలేదు. వన్ ప్లస్ 5టీ మిడ్నైట్ బ్లాక్ కలర్ వేరియెంట్లో ఉన్న స్పెసిఫికేషన్లనే ఇందులోనూ ఏర్పాటు చేశారు.
