చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వన్ ప్లస్.. త్వరలో భారత మార్కెట్లోకి ఓ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయనుంది. వన్ ప్లస్6 పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ యాపిల్ ఐఫోన్ ఎక్స్ తరహాలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల వన్ ఫ్లస్6 ఫోన్ ఫోటోలు లీక్ అవ్వగా.. అందులో ఐఫోన్ ఎక్స్ ఫీచర్లు కనపడుతున్నాయి.

ఐఫోన్ ఎక్స్ తరహాలో ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా గతంలో విడుదల చేసిన వన్‌ప్లస్‌ 5, 5టి తరహాలో ఇందులోనూ డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉండబోతోంది.

క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1 వెర్షన్‌తో విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. వీటితోపాటు.. మరిన్ని అదనపు ఫీచర్లు కూడా ఈ ఫోన్లే ఉండే అవకాశం ఉందని సమాచారం.