Asianet News TeluguAsianet News Telugu

వన్ ప్లస్ 6 లుక్ లీక్.. అదిరిపోయింది..

గత మోడల్ ని మించిన ఫీచర్లతో వన్ ప్లస్6

OnePlus 6 Images Leaked: Here is How The Smartphone Will Look

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వన్ ప్లస్ మరో సంచలనం సృష్టించింది. అతి తక్కువ కాలంలోనే భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సంస్థల్లో ఇదీ ఒకటి.  తాజాగా.. ఈ కంపెనీ భారత మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

వన్ ప్లస్6 పేరిట ఈ ఫోన్ ఈ నెల 16వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మరికొద్ది గంటల్లో ఈ ఫోన్ విడుదల కానుండగా దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి. లీకైన ఇమేజ్‌లను బట్టి చూస్తే వన్ ప్లస్ 6 లుక్ అదుర్స్ అన్న రీతిలో ఉంది. 

ఆన్‌లైన్‌లో లీకైన ఫొటోల ప్రకారం వన్ ప్లస్ 6 లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఫుల్ వ్యూ డిస్‌ప్లే, పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్, మ్యాట్ ఫినిషింగ్, గ్లాస్సీ లుక్‌తో వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 

ఇక ఇందులో ఫీచర్ల విషయానికి వస్తే.. 6.28 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ తదితర ఫీచర్లు వన్ ప్లస్ 6 ఫోన్‌లో ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

ప్రస్తుతం లీకైన ఫీచర్ల ప్రకారం.. గత మోడల్స్ ని తలదన్నేలా దీనిని తయారు  చేసినట్లు తెలుస్తోంది. ఇతర కంపెనీలకు కూడా ఈ తాజా స్మార్ట్ ఫోన్ గట్టి కాంపిటీషన్ ఇస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios