పది నిమిషాల్లో రూ.100కోట్లు

OnePlus 6 First Sale in India Saw Rs. 100 Crores Worth of Sales in 10 Minutes
Highlights

హాట్ కేకుల్లా అమ్ముడైన వన్ ప్లస్6

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వన్ ప్లస్.. భారత మార్కెట్లో సంచలనం సృష్టించింది. వన్ ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌నుఈ నెల 17వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫోన్ నేటి నుంచి అమెజాన్ సైట్‌లో లభిస్తున్నది. అయితే ఈ ఫోన్‌కు గాను నిన్ననే ప్రివ్యూ సేల్‌ను నిర్వహించారు.

ఈ సేల్‌లో మొదటి 10 నిమిషాల్లోనే రూ.100 కోట్ల విలువైన వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేశారు. ఈ సేల్‌లో మొత్తం 25వేల యూనిట్లు అమ్ముడైనట్లు వన్ ప్లస్ వెల్లడించింది. అయితే ఈ రోజు నుంచి ఈ ఫోన్ అమెజాన్‌లోనే ఓపెన్ సేల్‌లో లభిస్తున్నది.

ఇప్పటికే సేల్ ప్రారంభం కాగా ఈ ఫోన్‌ను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. కాగా వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.34,999, రూ.39,999 ధరలకు లభిస్తున్నది.

loader