వన్ ప్లస్5 వినియోగదారులకు శుభవార్త

వన్ ప్లస్5 వినియోగదారులకు శుభవార్త

మీరు వన్ ప్లస్5 ఉపయోగిస్తున్నారా..? అయితే.. ఇది నిజంగా మీకు శుభవార్తే. వన్ ప్లస్ 5 వినియోగదారులకు కంపెనీ  ఫేస్ అన్ లాక్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే.. కేవలం మీ ఫేస్ తో మీ ఫోన్ ని అన్ లాక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు వన్ ప్లస్ 5టీకి మాత్రమే ఈఫీచర్ అందుబాటులో ఉండేది. కాగా.. వనప్లస్ 5కి కూడా ఈ ఫీచర్ తీసుకువస్తామని ఇటీవల కంపెనీ మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం.. ఈ ఫీచర్ ని ఇప్పుడు వన్ ప్లస్ 5లో కూడా ప్రవేశపెట్టింది.

ఈ ఫీచర్ మీ ఫోన్ లో వినియోగించుకోవాలంటే.. మీరు మీ ఫోన్ ని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆక్సీజన్ ఓఎస్ ఓపెన్ బీటా2 వర్షన్ ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వర్షన్ తో మీకు ఫేస్ అన్ లాక్ ఆప్షన్ మీ సొంతమౌతుంది. అంతేకాకుండా ఆక్సీజన్ ఓఎస్ ఓపెన్ బీటా 3 వర్షన్ ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ వర్షన్ కూడా ఇన్ స్టాల్ చేసుకుంటే.. వన్ ప్లస్ 5లో మరిన్ని ఫీచర్లను పొందే అవకాశం ఉంది. ఈ వర్షన్ ని ఇన్ స్టాల్ చేసుకునేందుకు వన్ ప్లస్ కంపెనీ ఫ్లాషింగ్ గైడ్ ని కూడా ఏర్పాటు చేసింది. ఇది వన్ ప్లస్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos