Asianet News TeluguAsianet News Telugu

నూజివీడు ఎమ్మెల్యేకి టీడీపీ వల?

  • నూజివీడు ఎమ్మెల్యే పార్టీ మారతారంటూ ప్రచారం
  • వార్తలను ఖండించిన ఎమ్మెల్యే వెంకటప్రతాప్ అప్పారావు
  • మరొోసారి మైండ్ గేమ్ మొదలుపెట్టిన టీడీపీ 
one more ycp mla ready to jump into tdp

నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు టీడీపీలో చేరనున్నారా? ఆయనను టీడీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు వల వేస్తున్నారా? అవునన్న సమాధానమే వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవలే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ ని వదిలి టీడీపీలో చేరారు. మరో  మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కాగా.. మరో ఎమ్మెల్యే పార్టీ మారనున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

నూజివీడు ఎమ్మెల్యే వెంకట ప్రతాప్.. టీడీపీలో చేరనున్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయంలో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని స్పష్టంగా చెప్పొచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ఇప్పటిదాకా ఇదే ట్రిక్ ని ఉపయోగించారు టీడీపీ నేతలు. ఎవరో ఒకరు ఎమ్మెల్యేను ఎంచుకోవడం.. వాళ్లు పార్టీ మారుతున్నారంటూ ఎల్లోమీడియాలో వార్తలు రాయించడం సర్వసాధారణమైపోయింది. వాళ్లు మేము పార్టీ మారడంలేదని మొత్తుకున్నా కూడా ఆ రకం వార్తలు రావడం మాత్రం ఆగడం లేదు. దీంతో ఆ ఎమ్మెల్యేలు అభద్రతా భావానికి గురికవాల్సి వస్తోంది. దీంతో పార్టీ మారక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు ఇలాంటి మైండ్ గేమే నూజివీడు ఎమ్మెల్యేపై ప్రయోగిస్తున్నారు.

అయితే.. ఆ వార్తలను మాత్రం వెంకట ప్రతాప్ ఖండించారు. తాను అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ    అవాస్తవాలేనని తేల్చి చెప్పారు.  పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గురించి ప్రస్తావిస్తూ..మంత్రి పదవి కోసం గిడ్డి ఈశ్వరి పార్టీ మారడం దారుణమని ఆయన అన్నారు. మరి ఈ నూజివీడు ఎమ్మెల్యే .. టీడీపీ వలకి చిక్కుతాడో లేదో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన వారంతా తొలత పార్టీ మారడం లేదని చెప్పినవాళ్లే.

Follow Us:
Download App:
  • android
  • ios