నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం పూరీ తీరంలో సుదర్శన పట్నాయక్ ఓ సైకత శిల్పాన్ని చెక్కారు
ప్రముఖ సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ కి సోషల్ మీడియా దాసోహం పలుకుతోంది. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం. 2010లో దీనిని అధికారికంగా ప్రకటించారు. పులుల సంరక్షణ కోసం పాటుపడాల్సిందిగా ఈ రోజును జరుపుకుంటాం. దీనిని ప్రపంచ పులుల దినోత్సవం అని కూడా పిలుస్తారు.
కాగా.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పూరీ తీరంలో సుదర్శన పట్నాయక్ ఓ సైకత శిల్పాన్ని చెక్కారు. పులి నిద్రపోతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. దీనిని సుదర్శన్ తన ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిని చూసిన పలువురు చాలా అద్భుంగా ఉందని.. అచ్చం పులిలాగే ఉందంటూ మెచ్చుకోలుగా కామెంట్లు పోస్టు చేస్తున్నారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
Scroll to load tweet…
