రైతులకు మరొక వెసలుబాటు, పాతనోట్లతో విత్తనాలు కొనవచ్చు
చిల్లర నోట్లు లేక సతమతమవుతున్న రైతులకు కేంద్రం మరొక వెసలు బాటు కల్పించింది. బ్యాంకుల వసతి లేకపోవడం, పనిచేయని ఎటిఎంలతో గ్రామీణ ప్రాంతాలలో రైతులకు చిల్ల ర నోట్ల బెడద తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వరంగ విత్తన కేంద్రాలలో లేదా రాష్ట్రస్థాయి విత్తన కార్పొరేషన్లు, రాష్ట్రస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో గుర్తింపు కార్డును చూపించి రైతులు ప్రస్తుత రబీ సీజన్ లో విత్తనాలను కొనుగోలు చేయడానికి రద్దు చేసిన రూ. 500 నోట్లను ఉపయోగించడానికి కేంద్రం అనుమతిని ఇచ్చింది.
ఇప్పటికే కేంద్రం, రైతులు వారి బ్యాంకు ఖాతాల నుండి వారానికి రూ. 25,000లను తీసుకోవడానికి నవంబర్ 17న అనుమతిని ఇచ్చింది. రబీ సీజన్ లో వ్యవసాయ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
