భువనేశ్వర్: ఒడిశాకు చెందిన ఓ మహిళ ఆస్పత్రిలో కాకుండా కల్వర్ట్  లో బిడ్డను ప్రసవించింది. దీనికి పాలనయంత్రాంగమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె ఇంటిని ఆరు నెలల క్రితం ఏనుగు ధ్వంసం చేసింది. 

అధికారులు ఆమెకు నష్టపరిహారం చెల్లించలేదు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా సురుబిల్ గ్రామంలో ఆమెకు ఇల్లు లేకుండా పోయింది. ఇంటి పునరుద్ధరణకు అధికారులు నష్టపరిహారం చెల్లించలేదని, సహాయం అందించలేదని లేదా నష్టపరిహారం చెల్లించలేదని జిల్లా పరిషత్ మెంబర్ చెప్పారు 

ఆ విషయాన్ని పరిశీలిస్తామని, తప్పు చేసినవారిని శిక్షిస్తామని మయూర్ భంజ్ జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు. మహిళ విషయం మీడియాలో వచ్చిన తర్వాత మెజిస్ట్రేట్ ఆ విధంగా చెప్పారు. 

ప్రమీలా తిరయా అనే ఆ మహిళ కాంక్రీట్ కల్వర్ట్ లో వెనక్కి ఒరిగి కూర్చున్న ఫొటోలు మీడియాలో వచ్చాయి. ఆమెకు ఆశా కింద సహాయం కూడా అందలేదని అంటున్నారు.