ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది అత్యధిక మంది లైక్‌ చేసిన ట్వీట్‌గా తొలి స్థానంలో .. అత్యధికులు రీట్వీట్‌ చేసిన ట్వీట్‌గా ఐదో స్థానంలో నిలిచింది.
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. ట్విట్టర్ చరిత్రలో ఎన్నడూ రాన్నన్ని లైక్లు.. ఆయన ట్వీట్ కి వచ్చాయి. ఓ ఘటనకు స్పందించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలో శ్వేత, నల్ల జాతీయుల మధ్య వివక్ష నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు నిదర్శనంగా ఇటీవల అక్కడ ఓ సంఘటన జరిగింది. గత శనివారం చార్లొట్స్విల్లేలో పలువురు ర్యాలీ చేపట్టారు. ర్యాలీ చేస్తున్న వారిపై ఓ కారు వేగంగా దూసుకు రాగా.. ఓ మహిళ మృత్యువాత పడింది. మరో 19మంది గాయాలపాలయ్యారు. దీంతో ర్యాలీ హింసాత్మకంగా మారింది. అప్పటి నుంచి దేశం కోసం పోరాడిన అమరుల విగ్రహాలు ఎక్కడ కనిపించినా తమ జాతికి చెందినవి కాదంటూ విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. దీనిపై ఒబామా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘ఒకరి చర్మరంగు, బ్యాక్గ్రౌండ్, మతం చూసి ద్వేషించడానికి మనుషులు పుట్టలేదు.’ అంటూ దక్షిణ ఆఫ్రికా వేగుచుక్క, మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చెప్పిన మాటల్ని గుర్తుచేస్తూ ఒబామా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో పాటు ఆయన రెండు జాతులకు చెందిన పిల్లలను కిటికీ నుంచి చూస్తున్న ఫొటోను ఒకటి షేర్ చేశారు.
ఆయన ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే 2.8 మిలియన్ లైక్స్, 1.2 మిలియన్ రీట్వీట్స్తో రికార్డు సృష్టించింది. అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్గా తొలి స్థానంలో .. అత్యధికులు రీట్వీట్ చేసిన ట్వీట్గా ఐదో స్థానంలో నిలిచింది. జాతి వివక్షతను నేను కూడా ఎదుర్కొన్నానంటూ ఇటీవల ఒబామా భార్య, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా చెప్పిన సంగతి తెలిసిందే.
