హైదరాబాద్ లో యువతి అనుమానాస్పద మృతి

nursing student suspicious death
Highlights

  • హైదరాబాద్ లో దారుణం
  • యువతి అనుమానాస్పద మృతి

  ప్రేమలో మోసపోయి ఓ యువతి ప్రేమికుల రోజున మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ప్రేమించిన ప్రియుడు చంపాడా? లేక ఆ యువతే ఆత్మహత్యకు పాల్పడిందా ? అన్న విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. అయితే  ఈమె మృతి తర్వాత ప్రియుడు స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోవడంతో ఈమె మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ ప్రేమ జంటకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం చినకమలాపూర్ కు చెందిన తెల్లం రమాదేవి(21) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఈ యువతి వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలానికి చెందిన ప్రశాంత్‌ అనే యువకుడితో ప్రేమలో పడింది.  దీంతో  వీరిద్దరూ కలిసి ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. కాగా కొన్ని రోజులుగా వీరిద్దరి మద్య పెళ్లి విషయంలో గొడవ జరుగుతున్నాయి.  

ఈ క్రమంలో ఏమైందో ఏమో గానీ తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రమాదేవిని ఈ నెల 11న  ప్రశాంత్, అతడి స్నేహితులు కలిసి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుండి హాస్నత్రిలో చికిత్స పొందుతున్న రమాదేవి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారి ఇవాళ మృతి చెందింది. 

ఈమె మరణ వార్త తెలియగానే ప్రియుడు ప్రశాంత్‌ నేరుగా జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ కు వెళ్లి లొంగిపోయాడు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమాదేవి మృతిపై విచారణ జరుపుతున్నారు.


 

loader