నీపా వైరస్ రోగికి చికిత్స చేస్తూ మృత్యువాత పడిన నర్సు

Nurse taking care of Nipah patients dies
Highlights

నీపా వైరస్ రోగికి చికిత్స చేస్తూ లినీ (21) అనే నర్సు  మృత్యువాత పడింది.

కోజికోడ్: నీపా వైరస్ రోగికి చికిత్స చేస్తూ లినీ (21) అనే నర్సు  మృత్యువాత పడింది. కేరళలోని పెరంబ్ర తాలుకా ఆస్పత్రిలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యులను చూసే అవకాశం కూడా ఆమెకు దక్కలేదు.

ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లినీ మరణంతో నీపా వైరస్ మృతుల సంఖ్య పదికి పెరిగింది. ఆదివారంనాటికే ఆ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మాలప్పురం జిల్లాలో నలుగురు కూడా నీపా వైరస్ కారణంగానే మరణించినట్లు చెబుతున్నారు. 

వైరస్ వ్యాపిస్తుందనే కారణంతో లినీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకుని వెళ్లలేదు. విద్యుత్ దహనవాటిక ద్వారా అంత్యక్రియలు చేయడానికి వారు ఆరోగ్య శాఖకు అనుమతి ఇచ్చారు. 

ఆమె ఇద్దరు పిల్లలు సిద్ధార్థ్ (5), రితుల్ (2) చివరి చూపునకు కూడా నోచుకోలేదు. లినీ అనారోగ్యానికి గురైందని తెలుసుకున్న భర్త సజీస్ గల్ఫ్ నుంచి రెండు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. 

లినీ నీపా వైరస్ కారణంగానే మరణించినట్లు పూణే ఇనిస్టిట్యూట్ ధ్రువీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. 

loader