సోషల్ మీడియాపై పాఠాలు చెప్పే మహిళా ప్రొఫెసర్ కే సోషల్ మీడియాలో వేధింపులు

Nri posts vulgar comments on social media
Highlights

 వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా ప్రొఫెసర్

ఆమెది ఓ ప్రముఖ కేంద్ర సంస్థలో ప్రొఫెసర్ గా ఉద్యోగం. ముఖ్యంగా ఆమె చెప్పే పాఠాలన్నీ సోషల్ మీడియా పైనే. కానీ అలాంటి ఓ మహిళపైనే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వేధింపులకు దిగాడు. దీంతో సదరు మహిళా ప్రొఫెసర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసముంటున్న దీపా నాయర్ ఓ కేంద్ర సంస్థలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.  దేశంలోని ఐఎస్ఎస్, ఐపీఎస్ అధికారులకు సోషల్ మీడియాపై క్లాసులు నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా ఈమె లాయర్ గాను డాక్టర్ బాగా ఉన్నతమైన చదువులు చదివారు. ఇలాంటి  మహిళకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది.

దీప మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కు ఓ వ్యక్తి అసభ్యకరమైన రిప్లైలు ఇవ్వడమే కాకుండా, వ్యక్తిగతంగా దూషించాడు. దీనిపై సలుమార్లు ఆమె హెచ్చరించినప్పటికి వినకపోవడము కాకుండా దీప కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశాడు. దీంతో ఈ ప్రొఫెసర్ అతడిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాధు చేసింది.

ఈ ఫిర్యాదు గురించి దీప మాట్లాడుతూ... అమెరికాలో ఓ కంపెనీకి సీఈవో గా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇలా తనను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతడిపై పోలీసులకు కాకుండా కేంద్ర ప్రభుత్వానికి, అమెరికా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు దీప తెలిపింది. అతడికి పటుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఇలా ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని దీపా నాయర్ తెలిపారు.
 

 

loader