షాకింగ్.. మోదీకి మహాత్మాగాంధీ పేరు కూడా తెలీదా?

First Published 11, Apr 2018, 11:24 AM IST
Now, Modi calls Gandhi 'Mohanlal' instead of Mohandas
Highlights
సోషల్ మీడియాలో వైరల్ .. విమర్శలు కురిపిస్తున్న ప్రతిపక్షం

ప్రధాని నరేంద్రమోదీకి.. జాతిపిత మహాత్మాగాంధీ అసలు పేరు తెలియదా..? స్కూలుకి వెళ్లే ఐదేళ్ల పిల్లాడిని మహాత్మాగాంధీ అసలు పేరు ఏంటి అని అడిగితే.. ‘మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ’ అని ఎలాంటి తడబాటు లేకుండా చెబుతాడు.అలాంటిది దేశ ప్రధాని హోదాలో ఉండి మోదీ.. గాంధీ పేరులో మోహన్ దాస్ కి బదులు మోహన్ లాల్ గా పలికారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. మంగళవారం  నరేంద్రమోదీ..బిహార్ పర్యటనకు వెళ్లారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీని ‘ మోహన్ లాల్ కరమ్ చంద్ గాంధీ’ గా ప్రస్తావించారు.  ఆయన అలా అన్న వీడియోని కాంగ్రెస్ నేత గౌరవ్ పంఢి ట్విట్టర్ లో పోస్టు చేయగా... అది వైరల్ గా మారింది. ఒక్కాసారి అలా అంటే.. ఏదో పొరపాటుగాఅన్నారని అనుకోవచ్చు. కానీ.. మోదీ గాంధీ పేరు తప్పుగా పలకడం ఇదేమి తొలిసారి కాదని.. చాలా సార్లు తప్పు చెప్పారని గౌరవ్ తెలిపారు. గాంధీ మార్గంలో నడుస్తున్నామని, గాంధీ స్పూర్తితోనే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టామని నిత్యం చెప్పే మోదీ ఆయన పేరే తప్పుగా చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

loader