రాజకీయ నాయకుడిని రాజకీయాలను వేరు చేయడం సాధ్యమా?రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ హోదాలుంటాయా?ఉపరాష్ట్రతిగా ఉంటూ ఆంధ్రా చక్రం తిప్పడం వెంకయ్య మానేస్తారా? 

తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలసి ఉంటాయా, 2019 ఎన్నికల్లో గతంలో లాగే పవన్ కల్యాణ్ తో కలసి పోటీ చేస్తాయా... వదిలేస్తే ఎవరు ఎవరిని వదిలించుకుంటారు అనే ప్రశ్నలు మీడియాలో బాగా నలుగుతున్నాయి. అంతేకాదు, వైసిసి మీద బిజెపి చూపిస్తున్న వల్లమాలిని ప్రేమ ఏదో పబ్బం గడుపుకోవడానికేనా, లేక ఆ ఏడడుగులు నడిచి 2019 నాటికి ఒకటవుతారా అనే దాని మీద కూడా ఆసక్తి కరమయిన చర్చసాగుతూ ఉంది.

 వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగానే ఈ వార్తలను, ఈ ప్రశ్నలను పండితులు బాగా విశ్లేషంచారు. వెంకయ్యనాయుడు పబ్లీకునుంచి వెళ్లిపోవడం, చంద్రబాబునాయుడి అటకట్టే తీర్పు ఇచ్చారు. జగన్ క్యాంపులో సంబరాలు మొదలయ్యాయి. అయితే, వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయినంత మాత్రాన ఆంధ్రా చక్రం తిప్పడం మానేస్తారని ఎవరయినా అనుకుంటుంటూంటే వెర్రిమాలోకం అనుకోవాలి, నవ్వుకోవాలి.

దాదాపు నలభైయాభైయేళ్లు రాజకీయాలు పులుముకున్నవక్తి రాజకీయాలనుతుడిచేసుకోవడం కష్టం. ఆయన తప్పకుండా తెలుగుదేశం, బిజెపి సఖ్యత నిలబడేందుకు కృషి చేస్తారని టిడిపి వర్గాల్లో ఉంది. దానికి ఉదాహరణగా ఆయన నిన్న వెల్లడించిన మాట ను ఉదహరిస్తున్నారు.

నిన్న హైదరాబాద్ లో ఆయన్ను తెలంగాణ టిడిపి నేతలు కలిశారు. అభినందనలు చెప్పారు. యాదగిరి గుట్ట ప్రసాదం అందించారు. అయితే, సమావేశంలో ఆయన ఒక అసక్తికరమయిన రాజకీయ రహస్యం వెల్లడించారు.తెలంగాణ టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు కనిపించగానే ఆయన రండి, కాబోయే గవర్నర్ గారూ అని సంబోధించారు. ఈ మాట వచ్చింది ఉప రాష్ట్రపతిగా బాధ్యతులు స్వీకరించబోతున్న వ్యక్తి నుంచి. ఇదెంత అధికారికంగా ఉంటుందో వేరే చెప్పనవసరంలేదు. గవర్నర్ కావాలని మోత్కుపల్లికి వుంది. మాస శివరాత్రిలాగా ఆయన పేరు నెలకొక సారి పత్రికల్లో ప్రత్యక్ష మవుతూ ఉంటుంది కాబోయే గవర్నర్అంటూ. అదింతవరకు నెరవేరలేదు. టిడిపి-బిజెపి సంబంధాలు తెగిపోతాయేమో అనే వార్తల మధ్య మోత్కుపల్లి వ్యవహారం ఇపుడు దాదాపు మరుగున పడింది.

ఇపుడు వెంకయ్యనాయుడు సంబోధనతో ఇది తొందర్లో నిజమవుతూ ఉందనిపిస్తుంది. బహుశా ఇది ఆయన వెల్లడించిన చివరి రాజకీయ రహస్యమనుకోవాలా? 

ఎందుకంటే,ఈ మాట వెలువడింది ఉపరాష్ట్రపతి నోట. వెంటనే దీనితో మోత్కుపల్లి వర్గంలో సంబరాలు మొదలయ్యాయి.

నిన్న వెంకయ్య నాయుడిని కలుసుకున్న టిటిడిపి బృందంలో తెలంగాణా అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ ఎంపి నామా నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తదిరులు ఉన్నారు.