Asianet News TeluguAsianet News Telugu

టొమాటో దొంగలొచ్చేశారు...

  • టొమాటో ధరలు ఆకాశాన్నంటాయి 
  • దీనితో టొమాటో దొంగలు తయారయ్యారు
  • ముంబాయి మార్కెట్లో టొమాటోలను కాపాడుకునేందుకు సెక్యూరిటీ గార్డులు
now high price forces traders hire security guards for their tomotoes

 

 

టొమాటొ ఇపుడు చాలా ఖరీదయిన సరుకయింది. ఎంతఖరీదయినదంటే, దొంగలబెడద ఎదుర్కొంటావుంది, వ్యాాపారులను అదరగొడుతూ ఉంది.  దొంగల బెడద తప్పించుకునేందుకు ప్రయివేటు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటుచేసుకోవలసి వస్తున్నది.

టొమాటొ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో  ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఎక్కడో లాటిన్ అమెరికా నుంచి వచ్చి పడ్డా, ఇపుడు ఇండియాలో  తూర్పయినా,పడమరయిన, దక్షిణమయినా, ఉత్తరమయినా టొమాటొలేకుండా ఏకూర వండటం సాధ్యంకాదు.  దీనితో  ప్రజలకేమిచేయాలో పాలుపోవడం లేదు. ఈ పరిస్థితే వల్లే దొంగిలించిన టామటా కూర తినాలనుకుంటున్నారు. కిలో టొమాటొ సుమారు మార్కెట్లో నూర్రూపాయలనుంచి  నుండి నూటా ఇరవై దాకా  అమ్ముతున్నారు.దీనివల్ల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కూరగాయల మార్కెట్లో టమాట దొంగతనాలుఎక్కువయ్యాయి. పోలీస్ స్టేషన్ కు ఉన్నట్లుండి టమాటా దొంగతనం కేసులురావడం ఎక్కువయింది. సెక్యూరిటీ కావాలని ప్రభుత్వాన్ని అడిగారు. అది దొరకలేదు.ఫలితంగా సొంతంగా సెక్యూరిటీ ఏర్పాటుచేసుకోవలసి వచ్చిందని వ్యాపారులు అంటున్నారు. 

దొంగతనాల వల్ల మార్కెట్లోని వ్యాపారుల మధ్య గొడవలు, ఉద్రిక్తత నెలకొంటున్నది. ముంబైలోని దహిసార్ లో దొంగలు మూడొందల  కిలోల టొమాటొలను ఎత్తుకుపోయి సంచలన సృష్టించారు.  వాటి విలువ రూ.70వేల దాకాఉంటుంది. దీనితో టొమాటొ వ్యాపారులు భయపడిపోయారు.   దీని వల్లే  సెక్యూరిటీ గార్డులను ఏర్పాటుచేసుకున్నారు. టొమాటొ కుప్పలను గార్డులు కాపలా కాస్తుండటం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios