ప్రత్యూషా బెనర్జీపై బయోపిక్ ‘హర్‌ పల్‌ హై యహా ధోకా’ అనే టైటిల్‌తో సినిమా  ప్రత్యూషగా తనీషా సింగ్‌   

హిందీలో ప్రాచుర్యం పొందిన ‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు)ధారా వాహిక ద్వారా ప్రాచుర్యం పొందిన ప్రత్యూష బెనర్జీ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ‘హర్‌ పల్‌ హై యహా ధోకా’ అనే టైటిల్‌తో సినిమా తీయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రత్యూషగా తనీషా సింగ్‌ కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్ర బృందం తెలిపింది.

కాగా..రాహుల్‌ రాజ్‌ అనే మోడల్‌తో ప్రేమలో ఉన్న ప్రత్యూష 2016 ఏప్రిల్‌ 1న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ప్రత్యూష ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. మరి ఈ చిత్రంలో ఆ విషయాలు తెలియజేస్తారేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.