ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ నోకియా నుంచి మరో ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నోకియా 7 పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ ని బడ్జెట్ ధరలోనే వినియోగదారులకు అందజేస్తోంది. శాంసంగ్ ఫోన్ కి ధీటుగా ఈ ఫోన్ని నోకియా విడుదల చేసింది. ఫోన్ ధర రూ.32వేలుగా కంపెనీ ప్రకటించింది.  మీడియం ధరకే అత్యాధునిక ఫీచర్లను అందజేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ నుంచి ఈ ఫోన్ అమ్మాకాలు ప్రారంభం కానున్నాయి.

నోకియా7 ప్లస్ ఫోన్ ఫీచర్లు..

6 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్3 స్క్రీన్ ప్రొటెక్షన్,క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 256జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ, డ్యుయల్ వెనుక కెమేరా(12మెగా పిక్సెల్, 13మెగాపిక్సెల్), 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఆపరేటింగ్ సిస్టమ్, 3,900 ఎంఏహెచ్ బ్యాటరీ