మరోసారి తగ్గిన నోకియా6 ఫోన్ ధర

Nokia 6 price cut again, but its new price of Rs 12,999 is too late and too little
Highlights

ఇప్పటికే నోకియా 6 ఫోన్ ధర రెండు సార్లు తగ్గింది

నోకియా6 స్మార్ట్ ఫోన్ ధర మరోసారి తగ్గింది. గతంలో ఒకసారి ఫోన్ పై రూ.1500 తగ్గించగా.. తాజాగా మరోసారి తగ్గించింది. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ గతేడాది  జూన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా.. తొలుత విడుదల చేసిన సమయంలో ఫోన్ ధర రూ.14,999గా ఉంది. కాగా.. గతంలో ఫోన్ పై రూ.1500 తగ్గింపు ప్రకటించి రూ.13,499కే అందించింది.

వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు తాజాగా.. మరో రూ.500 తగ్గంచి రూ.12,999కే ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త ధర నోకియా 6 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌ సిల్వర్‌, మేట్‌ బ్లాక్‌ రంగుల ఆప్షన్లకు అందుబాటులో ఉంది. నోకియా 6(2018) స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు కొన్ని గంటల ముందు ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను హెచ్‌ఎండీ గ్లోబల్‌ తగ్గించింది. ఈ కొత్త ధరతో పాటు అమెజాన్‌ ఇండియాలో అందుబాటులో ఉన్న ఎక్స్చేంజ్‌ ఆఫర్‌తో నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తక్కువగా రూ.9,915కే లభ్యమవుతోంది. నోకియా 6 3జీబీ ర్యామ్‌తో పాటు 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 16,999 రూపాయలుగా ఉన్న దీని ధరను, కంపెనీ ఏ మాత్రం మార్పు చేయలేదు. కేవలం 3జీబీ ర్యామ్ ఫోన్ ధర మాత్రమే తగ్గించింది.

నోకియా6 ఫీచర్లు..

5.5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే 
2.5డీ కర్వ్‌డ్‌ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
16 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా సెన్సార్‌
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా సెన్సార్‌, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు ఎక్స్‌పాండబుల్‌ మెమరీ
ఫ్రంట్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

loader