ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. నోకియా6 ఫోన్ భారీ ఆఫర్ ప్రకటించింది. గతేడాది మార్కెట్లోకి విడుదలైన నోకియా6 ఫోన్ ధర తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తొలుత ఈ ఫోన్ విడుదల చేసిన సమయంలో దీని ధర రూ.14,999గా ప్రకటించారు. కాగా.. తాజాగా దీనిపై ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ లో రూ.1500వరకు డిస్కౌంట్ ప్రకటించారు. ధర తగ్గింపు అనంతరం నోకియా6 ఫోన్

రూ.13,499కే లభిస్తోంది. ఒకప్పుడు నోకియా ఫోన్లకు ఉన్న డిమాండ్ ప్రస్తుతం లేదనే చెప్పాలి. వివిధ రకాల కంపెనీలు మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్ ఫోన్లను తీసుకురావడంతో నోకియా మార్కెట్ పడిపోయింది. అందుకే ధర తగ్గించి మరీ మళ్లీ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మరి ఈ సారైనా కష్టమర్లను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

నోకియా6 ఫోన్ ఫీచర్లు..

5.5 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ స్క్రీన్

గొరిల్లా గ్లాస్3 స్క్రీన్ ప్రొటెక్టర్

ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్

32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ

ఆండ్రాయిడ్ 7.1.1 నోగౌట్ ఆపరేటింగ్ సిస్టమ్

16మెగాపిక్సెల్ వెనక కెమేరా

8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమేరా

ఎల్ఈడీ ఫ్లాష్

3000ఎంఏహెచ్ బ్యాటరీ