ఒకేసారి మార్కెట్లోకి మూడు నోకియా స్మార్ట్ ఫోన్లు

Nokia 6 (2018), Nokia 7 Plus, Nokia 8 Sirocco Launched in India
Highlights

అమ్మకాలు ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభం

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లోకి ఒకేసారి మూడు నోకియా స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. నోకియా 6(2018), నోకియా 7 ప్లస్‌, నోకియా 8 సిరోకో మోడల్‌ ఫోన్లు ఈ రోజు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. నోకియా 6(2018) గతేడాది విడుదల చేసిన నోకియా 6కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌. నోకియా 6(2018) ధర రూ. 16,999, నోకియా 7 ప్లస్‌ ధర రూ. 25,999, నోకియా 8 సిరోకో ధర రూ. 49,999గా ప్రకటించింది. నోకియా 6 అమ్మకాలు ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక నోకియా 7 ప్లస్‌, నోకియా 8 సిరోకో ప్రీ ఆర్డర్లు ఏప్రిల్‌ 20న మొదలవనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ రెండు ఫోన్ల అమ్మకాలు ఏప్రిల్‌ 30 నుంచి ప్రారంభం కానున్నాయి.

నోకియా6(2018) ఫీచర్లు..

5.5 ఇంచెస్ డిస్ ప్లే, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్, 32జీబీ, 64జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 16మెగా పిక్సెల్ వెనక కెమేరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం.

నోకియా7 ప్లస్ ఫీచర్లు...

 

6ఇంచెస్ డిస్ ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 12, 13మెగా పిక్సెల్ తో రెండు వెనక కెమేరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 3800ఎంఏహెచ్ బ్యాటరీ

నోకియా8 సిరోకో ఫీచర్లు..

5.5 ఇంచెస్ డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్, 12, 13మెగా పిక్సెల్ రెండు వెనక కెమేరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 3000ఎంఏహెచ్

loader