నోకియా5,6 స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త

Nokia 5 and original Nokia 6 start receiving Android 8.1 Oreo update
Highlights

ఈ ఫోన్లకి న్యూ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వచ్చింది

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా 5, 6 స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులకు శుభవార్త తెలియజేసింది.ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్‌డేట్‌ను విడుదల చేసింది. నోకియా 5 ఓఎస్ అప్‌డేట్ సైజ్ 866 ఎంబీ ఉండగా నోకియా 6 ఆప్‌డేట్ సైజ్ 933 ఎంబీ ఉంది. ఈ డివైస్‌లను వాడుతున్న యూజర్లు తమ ఫోన్లలో సెట్టింగ్స్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్‌ను ఎంచుకుంటే నూతన సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అవుతుంది. అనంతరం దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫోన్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్‌డేట్ అవుతుంది. 

ఆండ్రాయిడ్ 8.1 ఓఎస్‌లో యూజర్లకు పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. నూతన ఎమోజీలు, సెక్యూరిటీ, బ్యాటరీ సేవింగ్ నావిగేషన్ బటన్లు, నూతనంగా డిజైన్ చేసిన పవర్ మెనూ, సెట్టింగ్స్ మెనూ, బ్లూటూత్, బ్యాటరీ పర్సంటేజ్ తదితర ఫీచర్లు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో నోకియా 5, 6 స్మార్ట్‌ఫోన్ యూజర్లకు లభిస్తున్నాయి.

loader